సోమవారం వచ్చింది.. శానా కష్టం తెచ్చింది

ఆచార్యకు అసలైన పరీక్ష మొదలైంది. సోమవారం వచ్చింది. వర్కింగ్ డేస్ మొదలయ్యాయి. థియేటర్లలో ఇప్పటికే కష్టంగా సాగుతున్న ఈ సినిమా, ఇవాళ్టి నుంచి ఎలా నడుస్తుందనే ఆందోళన అందరిలో ఉంది. సినిమా ఫ్లాప్ టాక్…

ఆచార్యకు అసలైన పరీక్ష మొదలైంది. సోమవారం వచ్చింది. వర్కింగ్ డేస్ మొదలయ్యాయి. థియేటర్లలో ఇప్పటికే కష్టంగా సాగుతున్న ఈ సినిమా, ఇవాళ్టి నుంచి ఎలా నడుస్తుందనే ఆందోళన అందరిలో ఉంది. సినిమా ఫ్లాప్ టాక్ ఓవైపు, మండే ఎండలు మరోవైపు… దీంతో ఆచార్యకు కష్టాలు తప్పేలా లేవు.

చిరంజీవి-చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాకు మొదటి రోజు 33 కోట్ల రూపాయల షేర్ (జీఎస్టీలతో కలిపి) వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. మొదటి రోజే వరల్డ్ వైడ్ 50 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టు పోస్టర్ వదిలారు. కానీ రెండో రోజుకు సీన్ మొత్తం మారిపోయింది.

మొదటి రోజు వచ్చిన ఫ్లాప్ టాక్ తో రెండో రోజు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. మొదటి రోజు వచ్చిన షేర్ లో నాలుగో వంతు కూడా రెండో రోజు రాలేదు. ఇక మూడో రోజైన ఆదివారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. వీకెండ్ లో రావాల్సిన వసూళ్ల కంటే తక్కువగా ఆచార్యకు కలెక్షన్లు వచ్చాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నిన్న మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు రద్దయ్యాయి.అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న జనాలు కూడా టికెట్లు కాన్సిల్ చేసుకున్నారు.

ఈమధ్య కాలంలో ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువగా వసూళ్లు రావడం ఇదే తొలిసారి. పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. టికెట్ రేట్లు పెంచడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చకు మూలంగా మారింది ఆచార్య ఫలితం. ఇక ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు ఈ సినిమా ఎలా నడుస్తుందనేది ఊహించడమే కష్టంగా మారింది.