వెంకీ ‘శృతి’ చేయగలడా?

సీనియర్ కథానాయకులకు పెద్ద సమస్య హీరోయిన్లు. నాగ్, బాలయ్య, వెంకీ వీళ్లతో జత కట్టడానికి యంగ్ హీరోయిన్లు అంతగా ఇష్టపడడం లేదు. ఎక్కడెక్కడో వెదికి పట్టుకువస్తున్నారు. అసలే వెంకీ ఈ మధ్య రిటైర్డ్ హీరోయిన్లు…

సీనియర్ కథానాయకులకు పెద్ద సమస్య హీరోయిన్లు. నాగ్, బాలయ్య, వెంకీ వీళ్లతో జత కట్టడానికి యంగ్ హీరోయిన్లు అంతగా ఇష్టపడడం లేదు. ఎక్కడెక్కడో వెదికి పట్టుకువస్తున్నారు. అసలే వెంకీ ఈ మధ్య రిటైర్డ్ హీరోయిన్లు మీనా, శ్రియ లాంటి వాళ్లతో నటించాడు. ఇప్పుడు దశరథ్ తో కలిసి చేయబోయే సినిమాకు హీరోయిన్ వెదుకలాట మొదలయింది. 

శృతి హాసన్ అయితే బాగుంటుందని ఆలోచన. ఇప్పటికే శృతికి ఈ విషయం కన్వే చేసారు. అయితే ఇంకా ఓకే రాలేదు. సురేష్ బ్యానర్ వాల్యూ తో ఒప్పించగలమన్న ధీమాతో వున్నారట. అయితే దశరధ్ కు సరైన హిట్ లేకపోవడం, సోలోగా వెంకీకి సరైన సినిమా పడకపోవడం వంటి కారణాలు దీన్ని ప్రభావితం చేయచ్చు. వెయిట్ అండ్ సీ.