పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందే చిత్రం ఖరారైందనేది తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాని మీదే ఇంకా క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కూడా రెడీ అయిపోయాడు. సి. కళ్యాణ్ నిర్మాణంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
తమ బ్యానర్‌లోనే ఈ చిత్రం ఉంటుందని ఖరారు చేస్తూ వరుణ్ తేజ్ బర్త్‌డేకి సి. కళ్యాణ్ యాడ్స్ కూడా ఇచ్చేసాడు. నిర్మాత, దర్శకుడు, హీరో అందరూ ఫిక్స్ అయిపోయారు కనుక ఇక ఈ ప్రాజెక్ట్‌కి ముహూర్తం కుదరడమే బ్యాలెన్స్ ఉంది. టెంపర్ హిట్ అయితే ఇమ్మీడియట్‌గా పూరి సినిమా స్టార్ట్ చేయాలని మెగా ఫ్యామిలీ చూస్తోంది.
ఒకవేళ పూరిపై వెంటనే గురి కుదరకపోతే వరుణ్ తేజ్ కోసం వేరే దర్శకులని కూడా ఆప్షన్‌గా పెట్టుకున్నారు. కానీ ఎవరితో వరుణ్ రెండో సినిమా ఉంటుందనేది మాత్రం ఇప్పటికీ ఫిక్స్ చేయలేదు.