మెగా హీరోలు లేదా మహేష్ డామినేషన్ వల్ల నందమూరి హీరోలు ఈమధ్య కాస్త వెనుకబడ్డారు. అయితే ఈ ఏడాది నందమూరి హీరోలదే అవుతుందని ఎన్టీఆర్ జోస్యం చెప్పాడు. తప్పకుండా ఈసారి నందమూరి హీరోలు అందరూ సత్తా చాటుకుంటారని, 2010 తర్వాత మళ్లీ తమ హవా నడుస్తుందని ఎన్టీఆర్ ఫీలవుతున్నాడు.
నందమూరి హీరోల టైమ్ స్టార్ట్ అవుతుందో లేదో అనేది తెలీదు కానీ త్వరలో అభిమానుల కోసం జాతర అయితే మొదలు కానుంది. వరుసపెట్టి మూడు నెలల్లో ముగ్గురు నందమూరి హీరోల సినిమాలు రాబోతున్నాయి. వచ్చేవారం నందమూరి కళ్యాణ్‌రామ్ ‘పటాస్’ రిలీజ్ అవుతోంది. దీనిపై బజ్ బాగానే ఉంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 13న ఎన్టీఆర్ టెంపర్ రిలీజ్ అవుతుందని వార్తలొస్తున్నాయి. మార్చి 28న బాలకృష్ణ లయన్ రిలీజ్ అవుతుందట. ఈ చిత్రాలు కనుక అంచనాల్ని అందుకున్నట్టయితే ఈ ఏడాది నందమూరి హీరోల డామినేషన్ ఉంటుందని అనుకోవచ్చు. చూద్దాం ఈ నందమూరి సినీ జాతరలో ఎన్ని బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయో!