చౌదరిని టెన్షన్‌ పెడుతున్నారట

‘మెగా మేనల్లుడు’ సాయి ధరమ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేసిన క్రెడిట్‌ కూడా వైవిఎస్‌ చౌదరికి దక్కేలా లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. ‘రేయ్‌’ చిత్రాన్ని ఏనాడో మొదలు పెట్టిన వైవిఎస్‌ చౌదరి ఇంతవరకు దానిని…

‘మెగా మేనల్లుడు’ సాయి ధరమ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేసిన క్రెడిట్‌ కూడా వైవిఎస్‌ చౌదరికి దక్కేలా లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. ‘రేయ్‌’ చిత్రాన్ని ఏనాడో మొదలు పెట్టిన వైవిఎస్‌ చౌదరి ఇంతవరకు దానిని రిలీజ్‌ చేయలేకపోయాడు. అది పూర్తయ్యే లోగా సాయి రెండో సినిమా కూడా పూర్తయిపోయింది.
 
ఫిబ్రవరిలో రిలీజ్‌ అవ్వాల్సిన రేయ్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంకా వెలుగు చూడలేదు. మే 9న వస్తుందని వార్తలొస్తున్నాయి కానీ అప్పుడైనా గ్యారెంటీనా, కాదా అనేది తెలీడం లేదు. అయితే అప్పట్లోగా ఆ సినిమా విడుదల చేయకపోతే మాత్రం సాయి రెండో సినిమానే ముందు రిలీజ్‌ చేస్తామని మెగా కాంపౌండ్‌నుంచి వైవిఎస్‌కి కబురు వెళ్లిందట.

సాయి ధరమ్‌ తేజ్‌ని తన సినిమాతోనే పరిచయం చేయాలనేది వైవిఎస్‌ చౌదరి డ్రీమ్‌. కానీ రేయ్‌ చుట్టూ ఉన్న కష్టాల కంచె తొలగాలంటే అది అంత ఈజీగా అయ్యే పని కాదు. ఎక్కడ సాయి రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వచ్చేస్తే ‘రేయ్‌’కి ఉన్న ఒకే ఒక్క సెల్లింగ్‌ పాయింట్‌ అయిన సాయి ధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌ మూవీ అనే క్రెడిట్‌ పోతుందో అని చౌదరి టెన్షన్‌ అవుతున్నాడట. ఇప్పుడు రేయ్‌ని విడుదల చేసే మార్గాల్ని అతను అన్వేషిస్తున్నట్టు భోగట్టా.