లెజండ్ ఊపు బాగా తగ్గింది. మొదటి రోజు ఉన్న జోరు… రెండో రోజు నుంచీ కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై పెట్టుకొన్న రూ.50 కోట్ల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. తొలి 5 రోజులకు కలిపి రూ.20 కోట్ల దాకా వచ్చిందట. మంగళవారం నుంచీ.. లెజెండ్ వసూళ్లు భారీగా డ్రాప్ అవుట్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సీ సెంటర్లలో బాగున్నా… బీలో ఆజోరు లేదని తేలింది. ఏ సెంటర్లలో అయితే మరీనూ.
హైదరాబాద్లోని మల్టీప్లెక్స్ లు అన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. సినిమా ఏదైనా సరే.. మూడు రోజుల్లో వసూళ్లు రాబట్టుకోవాల్సిందే. ఆ తరవాత ఓ మాదిరి సినిమాలు నిలబడవు.. ఇది ట్రేడ్ వర్గాలు చెప్పేమాట. రామ్చరణ్ సినిమా ఎవడు కూడా అంతే. తొలి మూడు రోజులు దుమ్ము దులిపింది. ఆ తరవాత వసూళ్లు లేవు.
ఇప్పుడు లెజెండ్దీ అదే పరిస్థితి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి దూరమయ్యారని, అందుకే వసూళ్లు దగ్గుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బోయపాటి కాస్త ఫ్యామిలీ ఆడియన్స్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే బాగుణ్ణు. ఈరోజు డ్రాప్ అవుట్ అనే మాట వినిపించేది కాదు.. ఏం చేస్తాం..? ఇట్స్ టూ లేట్.