వాటికన్‌ను తప్పుపట్టిన యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ

చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు చేసిన కేసుల్లో చాలామంది క్రైస్తవ మతాధికారులు యిరుక్కున్నారు. 2001 నుండి యీ కేసులు వెలుగులోకి రాసాగాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న చర్చిలలో, చర్చిలు నడిపే స్కూళ్లల్లో, ఆసుపత్రుల్లో చదువుకునే పిల్లలపై కొందరు…

చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు చేసిన కేసుల్లో చాలామంది క్రైస్తవ మతాధికారులు యిరుక్కున్నారు. 2001 నుండి యీ కేసులు వెలుగులోకి రాసాగాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న చర్చిలలో, చర్చిలు నడిపే స్కూళ్లల్లో, ఆసుపత్రుల్లో చదువుకునే పిల్లలపై కొందరు మతగురువులు అత్యాచారాలు చేసినట్లు తెలియగానే స్థానిక పోలీసులు కేసులు పెట్టారు. 

వాటికన్‌ వారిని ఆ చట్టాలు వర్తించని యితర రాష్ట్రాలకో, యితర దేశాలకో బదిలీ చేసింది తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. చాలా చోట్ల ఆ పిల్లలకు డబ్బు యిచ్చి వూరుకోబెట్టింది. ఆ కారణంగా అత్యాచారాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. లక్షలాది బాలబాలికలు యిలాటి హింసకు గురవడంతో 'యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ ఆన్‌ రైట్స్‌ ఆఫ్‌ ద చైల్డ్‌' యీ కేసులపై విచారించి వాటికన్‌కు తీవ్రంగా విమర్శించింది. 

ఈ కమిటీలో వాటికన్‌ 1989లో సభ్యత్వం తీసుకుంది కాబట్టి కమిటీ ఆదేశాలను వారు పాటించవలసినదే. ప్రపంచవ్యాప్తంగా 18 మంది మానవహక్కుల నిపుణులు అనేకమంది బాధితుల కేసులను గత నెలలో విచారించి వాటికన్‌ చేష్టలను నిరసించారు. ఇలాటి అకృత్యాలు జరుగుతున్నాయని వాటికన్‌ కూడా అంగీకరించి, 2001లో అంతర్గతంగా కోర్టు ఏర్పరచుకుని విచారణ జరుపుతోంది. వారి ప్రతినిథి యీ కమిటీ నివేదికను తిరస్కరిస్తూ ''అలాటి బాలబాలికల రక్షణకై వాటికన్‌ ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ కమిటీ వాటిని గుర్తించకుండా ఏవేవో వ్యాఖ్యలు చేసింది.'' అన్నారు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]