బ‌న్నీ స‌ర‌స‌న‌ ప్రణీత‌?

త్రివిక్రమ్‌కి ప్రణీత తెగ న‌చ్చింద‌ట‌. అందుకే ఆమెని త‌న త‌దుప‌రి సినిమాకి కూడా కంటిన్యూ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆ విష‌యం గురించి డిస్కష‌న్లు జ‌రుగుతున్నట్టు స‌మాచారం. స‌రైన విజ‌యాల్లేక క‌నుమ‌రుగైపోయినట్టు అనిపించిన క‌న్నడ భామ…

త్రివిక్రమ్‌కి ప్రణీత తెగ న‌చ్చింద‌ట‌. అందుకే ఆమెని త‌న త‌దుప‌రి సినిమాకి కూడా కంటిన్యూ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆ విష‌యం గురించి డిస్కష‌న్లు జ‌రుగుతున్నట్టు స‌మాచారం. స‌రైన విజ‌యాల్లేక క‌నుమ‌రుగైపోయినట్టు అనిపించిన క‌న్నడ భామ ప్రణీత‌పై ఉన్నట్టుండి మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ క‌న్ను ప‌డింది. 

దీంతో ఆమెకి `అత్తారింటికి దారేది`లో అవ‌కాశ‌మిచ్చాడు. ప‌వ‌న్ కూడా అభ్యంత‌రం చెప్పక‌పోవ‌డంతో ఆమె ప‌వ‌ర్‌స్టార్ స‌ర‌స‌న బాపుబొమ్మలాగా క‌నిపించింది. నిజంగా.. అందంలో స‌మంత‌ని మించిపోయిన‌ట్టు క‌నిపించింది ప్రణీత. 

ఆ సినిమాతో టాలీవుడ్‌లో మ‌రో రెండు మూడు అవ‌కాశాల్ని ఒడిసిప‌ట్టింది. చిన్న చిత‌కా ఒప్పుకొనుంటే ఈ పాటికే ఆమె చేతిలో పది సినిమాలుండేవి. కానీ ప్రణీత మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. 

తాజా స‌మాచారం మేర‌కు… అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తీయ‌నున్న త‌దుప‌రి సినిమాలో ప్రణీతని ఓ క‌థానాయిక‌గా ఎంచుకొన్నట్టు స‌మాచారం. ఇద్దరు క‌థానాయిక‌లుండ‌గా.. ఇందులో రెండో పాత్ర ప్రణీత‌తో చేయించాల‌ని త్రివిక్రమ్ భావిస్తున్నాడ‌ట‌. ఆ మేర‌కు… బ‌న్నీని కూడా ఒప్పించిన‌ట్టు స‌మాచారం. త్వర‌లోనే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టబోతున్నారు.