నా దారి చేగువేరా-2

పవన్‌తో ఓ సాయంత్రం Advertisement ధైర్యం ఇవ్వగలిగే చదువు కోసం నాకు 25 ఏళ్ళ లాంగ్‌ డ్రీమ్స్‌ వున్నాయి. అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు లభించాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సమాన విద్య…

పవన్‌తో ఓ సాయంత్రం

ధైర్యం ఇవ్వగలిగే చదువు కోసం

నాకు 25 ఏళ్ళ లాంగ్‌ డ్రీమ్స్‌ వున్నాయి. అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు లభించాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సమాన విద్య లభించాలి. నేడు పేద ప్రజలు గవర్నమెంట్‌ స్కూళ్ళలో చదివితే సంపన్నుల పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ వ్యత్యాసం అంతరించి విజ్ఞానం కలిగే చదువు, బతకడానికి అవసరమయ్యే చాదువు, మనిషి ధైర్యం ఇవ్వగలిగే చదువు, మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోధి చేసే చదువు కావాలి, అలాంటి చదువును అందించే విద్యా వ్యవస్థ రావాలన్నదే నా తొలి కోరిక, ఆశ. ప్రభుత్వ ఉద్యోగం కోసం చదవడం మాని, తమ కాళ్ళపై తాను నిలబడి బతికేందుకు పనికొచ్చే విద్య కావాలి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచే చదువులు రావాలి.

శ్రమ చేసే వ్యక్తి శ్రామికుడిగానే మిగిలిపోతున్నాడు. కోట్లు సంపాదించేవారు ఇంకా ఇంకా సంపాదిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఆర్థిక అసమనాతలు తొలగి సమసమాజ స్థాపన జరగాలన్నదే నా ఆకాంక్ష.

ఎమ్మెల్యేలు ప్రజలకు భయపడాలి

ప్రస్తుతం మన సమాజంలో లా అండ్‌ ఆర్డర్‌ దిగజారిపోయింది. ఎంతగా క్షీణించిందంటే చట్ట సభల్లో అడుగు పెట్టి కోట్లాది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే ఎంత పెద్ద తప్పు చేసినా కాలర్‌ ఎగరేసుకుంటూ దర్జాగా తిరగ్గలుగుతున్నాడు. అదే ఓ సామాన్య పౌరుడు రాంగ్‌ రూట్‌లో వెళితే అతన్ని వెంబడిరచి మరీ శిక్షిస్తన్నారు. సామాన్యుడు శక్తిహీనుడు కాబట్టి అతనికి ఒక చట్టం, ఎమ్మెల్యేకు అధికారం, డబ్బు, హోదా వున్నాయి కాబట్టి అతనికి మరో చట్టం వున్నాయి. ఈ అసమానతలు తొలగాలి. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలకు ఓట్లేసిన ప్రజలే భయపడుతున్నారు, ఎమ్మెల్యేలు ప్రజలకు భయపడే రోజులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఏమిటీ వివక్ష

కొన్నేళ్ళ క్రితం నేను జైలులో ఓ ఖైదీని కలిశాను. అతడు ఓ చిన్న నేరంపై అండర్‌ ట్రయల్‌ ఖైదీగా జైలుకు వచ్చాడట. కోర్టులో అతడికి బెయిల్‌ లభించినా బెయిల్‌ ఫీజు కట్టడానికి 250 రూపాయలు లేకపోవడంతో ఆర్నెళ్ళుగా ఐలులోనే మగ్గుతున్నాడు. మర్డర్లు, మానభంగాలు చేసిన కరడుగట్టిన నేరగాళ్ళు దర్జాగా సమాజంలో తిరుగుతుంటే పేద ప్రజలు ఎంత వివక్షకు గురౌతున్నారో చూడండి. లా అండ్‌ ఆర్డర్‌లో పూర్తిగా మార్పు రావాలి.

వీరి అడుగు జాడల్లో…

క్యూబా విప్లవ కెరటం చేగువేరా జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయనే నాకు స్ఫూర్తి. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, నారాయణ్‌ గురు, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లు నాకు ఆదర్శం. సాధ్యమైనంతవరకు వీరి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తాను. ఖాళీ సమయం దొరికితే సోషల్‌ సైన్స్‌ పుస్తకాల్ని తిరగేస్తాను. ఇక సినిమాల్లో నాకు నచ్చిన దర్శకులు మణిరత్నం, సత్యజిత్‌రే, రుత్విక్‌ ఘటక్‌, రాజ్‌కపూర్‌, గురుదత్‌, అకీరా కురసోవాలు నాకు ఎంతో ఇష్టం. వీరేగాక ఇప్పటిదాకా నాతో పనిచేసిన దర్శకులందరూ నాకు ఇష్టమే. సబ్జెక్టుకు న్యాయం చేస్తారనే నమ్మకం కలిగాకే నేను వారితో పనిచేశాను.

సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలి

మనకంటే తర్వాత మానవ మనుగడ సాధించిన సింగపూర్‌ లాంటి చిన్న దేశంలో ఇది పూర్తిగా సాధ్యమైంది. భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక నుండి బతుకు తెరువు కోసం వెళ్ళి స్థిరపడ్డ సింగపూర్‌ వాసుల్ని, దేశాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.

స్త్రీలు ఆర్థికంగా ఎదగాలి

ఇటీవల నన్ను కలిసిన ఓ మహిళ ‘అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం దేవుడెరుగు, పట్టపగలే మాకు రక్షణ లేదని’ వాపోయింది. మహిళలకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చే సమాజం రావాలి. లా అండ్‌ ఆర్డర్‌ సరిగ్గా ఉండి, సవ్యంగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంట్లో భర్త సంపాదన మీద ఆధారపడ్డ మహిళలెందరో నేటికీ ఎన్నో అవమానాల్ని, ఛీత్కారాల్ని మౌనంగా భారిస్తున్నారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలమనే ధైర్యం వచ్చినప్పుడే అన్యాయాల్ని ఎదిరించగలరు. గృహ హింస, వేధింపులకు గురి అవుతున్న వారికి గవర్నమెంట్‌ ప్రత్యామ్నాయ సహాయక చర్యలు చేపట్టినప్పుడే మహిళలు పురోగమిస్తారు. దీనికి తోడు మహిళల్లో స్ఫూర్తి కలగాలంటే ముందుగా వారిలో ఎడ్యుకేషన్‌ పెరగాలి.

ప్రేమ లేనిదే..!

మనిషి బతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. ప్రేమ లేనిదే మనిషి జీవితానికి ఎగ్జిస్టెన్స్‌ (మనుగడ) లేదు. ప్రేమ ఉన్న చోటే ఎదుటివారిని అర్థం చేసుకునే తత్వం, తోటి వారికి సహాయపడే గుణం అలవడుతాయి. ఇది బాల్యం నుండే మొదలవుతుంది. చిన్నప్పుడు అమ్మానాన్నల ప్రేమ, కాస్త పెద్దయ్యాక అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఇలా కుటుంబ సభ్యులతో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత భార్య, భర్త, పిల్లలతో మనం ప్రేమను పెంచుకుంటాం మనిషి జీవితాంతం వివిధ దశల్లో ప్రేమ వెన్నంటే వుంటుంది.

‘నువ్వు ఉన్న చోటే ఆలోచిస్తూ.. నాలుగ్గోడల మధ్య కలలు కంటూ కూర్చుంటే ఏమీ సాధించలేవు. ప్రజల మధ్య అడుగుపెడితే ఎన్నో అద్భుతాల్ని సాధించగలవు’ ఇదే న ఫిలాసఫీ.

(ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌లో పవన్‌కళ్యాణ్‌తో ఓ గంటసేపు గడిపినప్పుడు సమాజం, రాజకీయాలు, మానవ సంబంధాలపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలివి)

– శ్యాంమోహన్‌

Click Here For Part-1