తెలుగు చిత్ర పరిశ్రమలో సమంతని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ప్రస్తుతం రాణిలా తెలుగు పరిశ్రమని ఏలుతోన్న సమంత తనని ఇంతదానిని చేసిన తెలుగు సినిమాని ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రాణించిన సమంత ఇప్పుడు ఇంట గెలవాలని చూస్తోంది.
తన బోయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ కూడా ముందు తెలుగులో పాపులర్ అయిన తర్వాత తమిళ రంగానికి మకాం మార్చేసాడు. ఇప్పుడు పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోయి తెలుగు సినిమాల వైపే చూడ్డం లేదు. సమంత కూడా సిద్ధార్థ్‌ని ఫాలో అయిపోతూ తమిళ సినిమాల మీద మక్కువ చూపిస్తోంది.
ఈమధ్య తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు సైన్ చేస్తోంది. ఉన్న డేట్స్ అన్నీ అటు కేటాయించేస్తూ బిజీగా ఉన్నానని చెప్తోంది. తమిళ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఒకేసారి ఎక్కువైపోవడానికి సిద్ధార్థే కారణమో కాదో తెలీదు కానీ ఇలా తనని టాప్‌కి చేర్చిన సినీ పరిశ్రమనే పట్టించుకోకపోవడం మాత్రం దారుణం.