మటన్ అడిగితే చికెన్ పెట్టారని పెళ్లి ఆపేసుకొన్నారు!

పెళ్లి కొడుకు ఫ్యామిలీ విందులోకి మటన్ బిరియానీని వండమని కోరింది.. అయితే పెళ్లి కూతురు వాళ్లేమో చికెన్ బిర్యానీ వండి వివాహతంతును పూర్ది చేద్దామని అనుకొన్నారు.  దీంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీకి కోపం వచ్చింది.…

పెళ్లి కొడుకు ఫ్యామిలీ విందులోకి మటన్ బిరియానీని వండమని కోరింది.. అయితే పెళ్లి కూతురు వాళ్లేమో చికెన్ బిర్యానీ వండి వివాహతంతును పూర్ది చేద్దామని అనుకొన్నారు.  దీంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీకి కోపం వచ్చింది. గొడవ మొదలైంది. తాము చెప్పింది ఏమిటి? మీరు చేసింది ఏమిటి? అంటూ వారు రచ్చ  కు దిగారు. 
సర్దుకుపోవాల్సిన పెళ్లి కూతురు ఫ్యామిలీ కూడా వెనక్కు తగ్గలేదు. మీరు చెప్పిందే జరగాలా? మేము మటన్ బిరియానీ పెట్టేది లేదు, చికెనే పెడతాం.. తింటే తినండి లేకపోతే పొండి..అంటూ గొడవ చేశారు. చినికి చినికీ గాలివానగా మారిన ఈ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అంతిమంగా పెళ్లిని రద్దు చేసుకొనేంత వరకూ వెళ్లింది. దీంతో పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది!

పెళ్లి ఆగిపోవడం పెద్ద విశేషం కాదు కానీ..ఇలా చికెన్ బిరియానీ, మటన్ బిరియానీ విషయంలో తేడా వచ్చి పెళ్లి ఆగిపోవడమే విశేషంగా మారింది. బెంగళూరు పరిధిలోని కేజీ హళ్లి ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. వధూవరులు ఇద్దరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తన్న వాళ్లే.. వాళ్లిళ్లలో వాళ్లు కూడా విద్యావంతులే.. అయితే పట్టింపులో మాత్రం ఎవరూ వెనక్కు తగ్గలేదు. తమ దారి తమదేనని అన్నారు. 

పెళ్లి వేదికలోని ఈ గొడవ పోలీసుల వరకూ వెళ్లింది. అయితే కేసు నమోదు  చేయలేదని, వారికి సర్ధి చెప్పి పంపించామని పోలీసులు తెలిపారు. మరి ఖాకీలకు ఉన్న పాటి జ్ఞానం లేకపోయింది ఆ పెళ్లి పెద్దలకు!