మహేష్‌ నో అంటే ఎన్టీఆర్‌ యస్‌!

‘రుద్రమదేవి’ చిత్రంలో ‘గోన గన్నారెడ్డి’ క్యారెక్టర్‌ని మహేష్‌తో చేయించాలని గుణశేఖర్‌ చాలా ట్రై చేస్తున్నాడు. అయితే మహేష్‌ మాత్రం ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఒకప్పుడు తనకి బాగా క్లోజ్‌ అయిన గుణశేఖర్‌తో మహేష్‌…

‘రుద్రమదేవి’ చిత్రంలో ‘గోన గన్నారెడ్డి’ క్యారెక్టర్‌ని మహేష్‌తో చేయించాలని గుణశేఖర్‌ చాలా ట్రై చేస్తున్నాడు. అయితే మహేష్‌ మాత్రం ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఒకప్పుడు తనకి బాగా క్లోజ్‌ అయిన గుణశేఖర్‌తో మహేష్‌ ఇప్పుడు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నాడు. 

ఒక్కడులాంటి హిట్టిచ్చినా కానీ ఆ తర్వాత సైనికుడులాంటి డిజాస్టర్‌తో మహేష్‌ని గుణశేఖర్‌ బాగా డిజప్పాయింట్‌ చేసాడు. ఏ దర్శకుడితోను మూడు సార్లు పని చేయని మహేష్‌.. గుణశేఖర్‌తో మాత్రం మూడు సినిమాలు చేసాడు. ఆ తర్వాత మాత్రం మళ్లీ అతనితో పని చేయలేదు. భారీ బడ్జెట్‌ సినిమా అయిన రుద్రమదేవిలో మహేష్‌లాంటి స్టార్‌ ఉండాలని గుణశేఖర్‌ కోరుకుంటున్నాడు. 

మహేష్‌ కాదంటున్నాడు కాబట్టి ఎన్టీఆర్‌తో అయినా ఈ క్యారెక్టర్‌ చేయించాలని గుణశేఖర్‌ ట్రై చేస్తున్నాడట. రామాయణం సినిమాతో ఎన్టీఆర్‌ని వెండితెరకి పరిచయం చేసిన గుణశేఖర్‌కి యంగ్‌ టైగర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందా? ఇరవై రోజుల పాటు కాల్షీట్స్‌ ఇస్తే షూటింగ్‌ పూర్తి చేసేస్తానని గుణశేఖర్‌ అడుగుతున్నాడట. మరి ఎన్టీఆర్‌ యస్‌ అంటాడో లేదో చూడాలిక.