మహేష్‌ని వాడేసుకుంటున్నాడు

హీరోల కొడుకులు, తమ్ముళ్లు, మేనల్లుళ్లు హీరోలైపోవడం ఇప్పుడు బాగా రొటీన్‌ అయిపోయింది. ఇప్పుడు ఏ హీరోతో అయినా వేలు విడిచిన చుట్టరికం ఉన్నా కానీ అది చూపించి తెర మీదకి వచ్చేస్తున్నారు. చుట్టాల్ని బాధ…

హీరోల కొడుకులు, తమ్ముళ్లు, మేనల్లుళ్లు హీరోలైపోవడం ఇప్పుడు బాగా రొటీన్‌ అయిపోయింది. ఇప్పుడు ఏ హీరోతో అయినా వేలు విడిచిన చుట్టరికం ఉన్నా కానీ అది చూపించి తెర మీదకి వచ్చేస్తున్నారు. చుట్టాల్ని బాధ పెట్టడం ఇష్టం లేక సదరు హీరోల సినిమాల ఆడియో వేడుకలకి సూపర్‌స్టార్స్‌ వస్తున్నారు. అలా మీడియా దృష్టిలోను, ఫాన్స్‌ కళ్లలోను పడి నిచ్చెన ఎక్కడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. 

ఆ బాటలోనే హీరోగా పరిచయం అవుతున్నాడు మహేష్‌బాబు బంధువులబ్బాయి కృష్ణ మాధవ్‌. మహేష్‌ నుంచి యాక్టింగ్‌ నేర్చుకోవాలని అతని సినిమాకి అసిస్టెంట్‌గా డైరెక్టర్‌గా చేరాడట ఈ మాధవ్‌. ఖలేజాకీ, దూకుడుకీ మహేష్‌ని బాగా గమనించేసి ఇక తాను యాక్టర్‌ అయిపోవాల్సిన టైమ్‌ వచ్చిందని ‘హృదయం ఎక్కడున్నదే’ సినిమా చేసాడట. 

ఆడియో విడుదల షరా మామూలుగా మహేష్‌తో చేయించుకున్న కృష్ణ మాధవ్‌ ఈ సినిమా ప్రమోషన్స్‌లో మహేష్‌ నామ స్మరణ చేస్తూనే ఉన్నాడు. మహేష్‌బాబు పేరు వాడుకుని పాపులర్‌ అయిపోవాలని చూస్తున్న కృష్ణమాధవ్‌లో మేటర్‌ ఉంటే తప్ప ఆడియన్స్‌ అయినా ఫాన్స్‌ అయినా కేర్‌ చేయరనుకోండి… అది వేరే సంగతి.