పవన్ – వెంకీ మల్టీస్టారర్‌కి టైటిల్‌తో చిక్కులొచ్చాయి. ఈ చిత్రానికి ముందు నుంచీ ఓరి దేవుడా అనే పేరుని అనుకొంటున్నారు. అయితే దాదాపు ఇదే పేరుతో మరో చిత్రం తెరకెక్కుతోంది. అదే.. ఓరి దేవుడోయ్. కోటి తనయుడు రాజీవ్ కథానాయకుడు. ఇది కూడా సోషియో ఫాంటసీ కథే. ఎప్పుడైతే పవన్, వెంకీల మల్టీస్టారర్‌కి ఓరి దేవుడా అనే పేరు అనుకొంటున్నారని తెలిసిందో… సరిగ్గా అప్పుడే రాజీవ్ సినిమా ప్రచారం కూడా ఊపందుకొంది.
ఓరి దేవుడోయ్ అనే టైటిల్‌పై సర్వాధికారాలూ మావే అని చెప్పడానికి ఈ చిత్ర బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు డి.సురేష్‌బాబు కి తమ రీమేక్ చిత్రానికి ఓరిదేవుడా అన్న పేరు మాత్రమే పర్ఫెక్ట్ అని తోస్తోందట. దాంతో.. చిన్న సినిమా నిర్మాతల్ని టైటిల్ కోసం సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మరి సురేష్‌బాబు ఒత్తిడికి ఆ నిర్మాతలు లొంగుతారా? లేదా? అనేది తేలాల్సివుంది.ఎందుకైనా మంచిదని ప్రత్యామ్నాయ టైటిళ్లను ఓమైగాడ్ కోసం వెదుకుతున్నారు. మరి ఈ టైటిల్ చిక్కుల నుంచి మల్టీస్టారర్ ఎలా బయటపడుతుందో చూడాలి.