థర్టీస్‌లోనే టాప్‌ గేర్‌: విద్యాబాలన్‌

విద్యాబాలన్‌.. నటిగా తొలి సినిమాతోనే సత్తా చాటుకున్నా.. టాప్‌ హీరోయిన్‌గా వెలగడానికి చాన్నాళ్ళు పట్టిందామెకి. ‘డర్టీపిక్చర్‌’ విద్యాబాలన్‌ కెరీర్‌ని టాప్‌ స్పీడ్‌కి తీసుకెళ్ళింది. హీరోయిన్‌గా విద్యాబాలన్‌ కెరీర్‌లో అత్యన్నత స్థానం సంపాదించుకున్నది ‘డర్టీపిక్చర్‌’ సినిమాతోనే.…

విద్యాబాలన్‌.. నటిగా తొలి సినిమాతోనే సత్తా చాటుకున్నా.. టాప్‌ హీరోయిన్‌గా వెలగడానికి చాన్నాళ్ళు పట్టిందామెకి. ‘డర్టీపిక్చర్‌’ విద్యాబాలన్‌ కెరీర్‌ని టాప్‌ స్పీడ్‌కి తీసుకెళ్ళింది. హీరోయిన్‌గా విద్యాబాలన్‌ కెరీర్‌లో అత్యన్నత స్థానం సంపాదించుకున్నది ‘డర్టీపిక్చర్‌’ సినిమాతోనే.

ప్రస్తుతం విద్యాబాలన్‌ అంటే బాలీవుడ్‌లో వున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టాప్‌ హీరోలకు ధీటుగా ఆమెకు నిర్మాతల భారీ పారితోషికం ఆఫర్‌ చేస్తున్నారు. థర్టీస్‌లోకి వచ్చాక.. అదీ పెళ్ళయ్యాక ఆమె కెరీర్‌ మరింత వెలిగిపోతోంది. కారణమేంటని అడిగితే, ఓ మహిళ థర్టీస్‌లోనే మరింత అందంగా వుంటుంది.. మానసికంగా ధృఢంగా తయారవుతుంది.. ఏ రంగంలో అయినా దూసుకుపోగలుగుతుంది.. నేనూ అంతేనేమో అని సమాధానమిచ్చింది విద్యాబాలన్‌.

పెళ్ళయ్యాక సినిమాలు మానెయ్యాలనే ఆలోచన ఒకప్పుడు వుండేదనీ, ఇప్పుడు ఆ ఆలోచన మారిందనీ చెబుతోన్న విద్యాబాలన్‌, తన భర్త సహకారంతో కెరీర్‌ ఇప్పుడిరకా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోగలుగుతున్నానని చెబుతోంది.