చేతిలో `బాహుబలి`, `రుద్రమదేవి` లాంటి భారీ ప్రాజెక్టులున్నా తమిళంలో అజిత్‌తో ఓ సినిమా చేయడానికి అనుష్క అంగీకారం తెలిపింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా గురించి ఎక్సైట్ అవుతూ వచ్చింది. నేను అజిత్ సినిమాలో నటిస్తున్నానోచ్… అంటూ తన సన్నిహితులతో చెబుతూ వచ్చింది. తీరా ఆ చిత్రబృందం కాల్షీట్లు అడిగేసరికి అనుష్క తెల్లమొహం వేసిందట.
అమ్మడి కాల్షీట్లు కనుచూపు మేరలో ఖాళీగా కనిపించలేదట. `బాహుబలి`, `రుద్రమదేవి` చిత్రాలకే వందల రోజులు కాల్షీట్లు ఇచ్చేసిందట. మరి అది తెలిసి కూడా మా సినిమాలో ఎందుకు నటిస్తానని ఒప్పుకొన్నావని గౌతమ్‌మీనన్ అడిగాడట. “మీ సినిమాలు త్వరగా సెట్స్‌పైకి వెళ్లవు కదా? ఆ ధైర్యంతోనే నటిస్తానని ఒప్పుకొన్నా“ అని చెప్పుకొచ్చిందట.
పోనీ ముందస్తుగా కనీసం పది రోజులైనా మా సినిమాకి కేటాయించమని ఆ చిత్రబృందం అడిగిందట. అందుకు కూడా అనుష్కకు వీలు కాలేదట. దీంతో గౌతమ్ మీనన్ పీక్కోలేక, లాక్కోలేక ఇబ్బంది పడుతున్నాడట. అనుష్క ఖాళీ అయ్యేవరకు వెయిట్ చేయాలా? లేదంటే మరో అమ్మాయిని వెదుక్కోవాలా అనే విషయం గురించి తెగ ఆలోచిస్తున్నాడట. అనుష్క మాత్రం కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయినందుకు గౌతమ్‌మీనన్‌కి సారీ చెప్పి వచ్చేసిందట.