శృతిహాసన్‌ డబుల్‌ డోస్‌

గబ్బర్‌సింగ్‌, బలుపు, ఎవడు… ఇలా వరుస కమర్షియల్‌ విజయాలతో శృతిహాసన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల లిస్టులో ఉంది. ఈ సమ్మర్‌లో రేసు గుర్రంతో మరోసారి లక్‌ పరీక్షించుకోబోతోంది. ఈ సినిమాతో ప్రస్తుతం ఫామ్‌లో…

గబ్బర్‌సింగ్‌, బలుపు, ఎవడు… ఇలా వరుస కమర్షియల్‌ విజయాలతో శృతిహాసన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల లిస్టులో ఉంది. ఈ సమ్మర్‌లో రేసు గుర్రంతో మరోసారి లక్‌ పరీక్షించుకోబోతోంది. ఈ సినిమాతో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న మెగా హీరోలు అందరితో నటించిన రికార్డ్‌ కూడా ఆమెకి దక్కుతుంది. 

సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ష్యూర్‌ షాట్‌ హిట్‌ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కిక్‌ తర్వాత సురేందర్‌ మళ్లీ ఆ స్థాయి ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నాడట. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అతని మ్యూజిక్‌ దీనికి పెద్ద ఎస్సెట్‌ అవుతుందని అంటున్నారు. అల్లు అర్జున్‌ రెచ్చిపోయి డాన్సులు వేసేలా తమన్‌ సూపర్‌ బీట్స్‌ అందించాడట. 

ఇక శృతిహాసన్‌ కూడా తన వంతుగా ఈ చిత్రం పాటల్లో స్వరం కలిపింది. అవడానికి పాప్‌ సింగర్‌ అయినా కానీ సినిమాల్లో మాత్రం చాలా రేర్‌గా తన టాలెంట్‌ చూపిస్తున్న శృతిహాసన్‌ ఈ సినిమాలో ఒక మస్త్‌ మస్త్‌ మాస్‌ సాంగ్‌ ఆలపించిందట. ఇకపై శృతిలోని సింగర్‌ని కూడా ఫ్రీక్వెంట్‌గా వాడుకునే లెవల్లో ఈ సాంగ్‌ క్లిక్‌ అవుద్దేమో చూద్దాం.