మహేష్‌, పవన్‌ లైనప్‌ ఇదే

మహేష్‌బాబు తదుపరి చిత్రం ఆగడు అనేది తెలిసినా కానీ దాని తర్వాత ఏది చేస్తాడనే దానిపై మాత్రం కొంత గందరగోళం నెలకొంది. ఆగడు మొదలు కాక ముందే కొరటాల శివతో యుటీవీ బ్యానర్‌లో మహేష్‌…

మహేష్‌బాబు తదుపరి చిత్రం ఆగడు అనేది తెలిసినా కానీ దాని తర్వాత ఏది చేస్తాడనే దానిపై మాత్రం కొంత గందరగోళం నెలకొంది. ఆగడు మొదలు కాక ముందే కొరటాల శివతో యుటీవీ బ్యానర్‌లో మహేష్‌ సినిమా చేస్తాడనే టాక్‌ స్ప్రెడ్‌ అయింది. కానీ మహేష్‌తో పూరి జగన్నాథ్‌, మణిరత్నం చెరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడంతో కన్‌ఫ్యూజన్‌ నెలకొంది. 

కానీ ఆగడు తర్వాత మహేష్‌ చేసే సినిమా మాత్రం కొరటాల శివదే అని తేలిపోయింది. దీని తర్వాతే మహేష్‌ మిగతా చిత్రాలుంటాయి. వాటిలో పూరి జగన్నాథ్‌ సినిమా ముందు మొదలయ్యే అవకాశముంది. ఇకపోతే పవన్‌కళ్యాణ్‌ లైనప్‌లో చిన్న ఛేంజ్‌ వచ్చింది. అతను ముందుగా గబ్బర్‌సింగ్‌ 2 చేద్దామని అనుకున్నా లేట్‌ అవుతోందని ఈలోగా ఓ మై గాడ్‌ రీమేక్‌ చేయడానికి అంగీకరించాడు. 

పవన్‌ది నెక్స్‌ట్‌ రిలీజ్‌ అయ్యే సినిమా ఓ మై గాడ్‌ రీమేక్‌ అని తేలిపోయింది. ఈ చిత్రాన్ని తక్కువ రోజుల్లో ఫినిష్‌ చేయాలని చూస్తున్నారు. ఇందులో పవన్‌ అరగంట పాటు కనిపించే ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. గబ్బర్‌సింగ్‌ 2ని ఏప్రిల్‌ లేదా మేలో స్టార్ట్‌ చేస్తారు. అది వచ్చే ఏడాది రిలీజ్‌ అవుతుంది. ఈ రెండూ కాకుండా పవన్‌కళ్యాణ్‌ మరే సినిమాకి కమిట్‌ అవలేదు.