అనుకొన్నదంతా జరుగుతోంది. గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు మీద పవన్ కల్యాణ్‌కి ప్రేమ తగ్గిపోయింది. ఈ సినిమా ఉండదు.. లేదు – అన్న అనుమానాలు నిజం అవుతున్నాయి. లేటెస్ట్ సమాచారమ్ ఏమిటంటే.. గబ్బర్ సింగ్ 2 సినిమానే లేదట. సంపత్ నందితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయడం నిజమే అయినా, అది గబ్బర్ సింగ్ కి సీక్వెల్ మాత్రం కాదని.. తెలుస్తోంది. అది వేరే కథ అట.
సంపత్ నంది స్ర్కిప్టు పవన్ ఆలోచనలకు అనుగుణంగా రానందున ఈ సినిమాని పక్కన పెట్టి, మరో కొత్త కథతో ప్రొసీడ్ అవ్వాలని పవన్ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం కొత్త కథ స్ర్కిప్టు ఇంకా పూర్తి స్థాయిలో సన్నద్ధం కానందునేనట. టైటిల్ కూడా గబ్బర్ సింగ్ 2 కాదని, అసలు ఈ సినిమాకీ గబ్బర్ కీ పోలికలే లేవని, కొత్త టైటిల్, కొత్త కథతో త్వరలోనే ఈ సినిమా విశేషాలు మీడియాకి తెలియజేస్తారని సమాచారమ్.