తనపై వస్తున్న వార్తలకు నటి సమంతా తెగ బాధ పడుతోంది. తాను అననివి, తాను ట్వీట్ చేయనివి కూడా తనకు అంటగట్టేస్తున్నారని ఆమె వాపోతోంది. ఏదైనా సరే తాను చెప్పాలనుకుంటే ధైర్యంగా ట్వీట్ చేస్తానని, అలా ట్వీట్ చేస్తే, అది చూసి ఎవరైనా ఏదైనా రాసుకోవచ్చని ఆమె అంటోంది.
Advertisement
అలా కాకుండా, తాను ట్వీట్ చేయకుండా చేసానని రాయడం సరికాదని, ఈ విషయంలో తన ట్విట్టర్ ఎక్కౌంట్ ఒకసారి సరిచూసి, రాయాలని కోరుతోంది. ఇంతకీ అమ్మడి బాధేంటంటే, ఆమె సూర్య, తదితర హీరోలపై కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయట. తానలా అనలేదని, అలాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తున్నారో తెలియడం లేదని అంటోంది.