‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్ అయినా కానీ తక్కువ బడ్జెట్లో క్వాలిటీ అవుట్‌పుట్ ఇచ్చిన దర్శకుడు పవన్ సాదినేనికి మంచి పేరు వచ్చింది. టెక్నికల్‌గా ఆ చిన్న చిత్రాన్ని అతను, తన బృందం అద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో పవన్ టాలెంట్‌ని పరిశ్రమ గుర్తించింది.
ముందుగా అతడికి ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి కబురు వచ్చింది. పవన్‌కి అడ్వాన్స్ ఇచ్చి అతనితో కథ సిద్ధం చేయిస్తున్నారు. అతను రూపొందించే కథని బట్టి హీరో ఎవరనేది డిసైడ్ అవుతుంది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లో ఎవరితో అయినా పవన్ సినిమా ఉండొచ్చు.
పవన్ సాదినేని తయారు చేసిన కథ, అప్పుడు ఉన్న హీరోల అవైలబులిటీని బట్టి హీరో ఎవరనేది డిసైడ్ అవుతుంది. షార్ట్ ఫిలింస్ చేసే స్థాయి నుంచి గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా డైరెక్ట్ చేసే వరకు ఎదిగిన ఈ యువ దర్శకుడిని అభినందించాల్సిందే.