అమ్మాయి రాత మారుస్తుందా పైసా

అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించిన కేథరీన్‌ స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని అప్పట్లో చెప్పుకున్నారు. ఇద్దరమ్మాయిలతో రిలీజ్‌ కాకముందే ఆమెని నెక్స్‌ట్‌ సమంత అని కూడా కొందరు తేల్చేసారు. కానీ కేథరీన్‌కి ఆ చిత్రంతో…

అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించిన కేథరీన్‌ స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని అప్పట్లో చెప్పుకున్నారు. ఇద్దరమ్మాయిలతో రిలీజ్‌ కాకముందే ఆమెని నెక్స్‌ట్‌ సమంత అని కూడా కొందరు తేల్చేసారు. కానీ కేథరీన్‌కి ఆ చిత్రంతో ఎలాంటి పేరు రాలేదు. ఆమెకి కొత్తగా అవకాశాలు కూడా దక్కలేదు. 

ఇద్దరమ్మాయిలతో కంటే ముందు ‘చమ్మక్‌ చల్లో’ అనే సినిమాలో నటించిన కేథరీన్‌ ఇప్పుడు తన ఆశలన్నీ ‘పైసా’ మీదే పెట్టుకుంది. చాలా కాలంగా రిలీజ్‌ కాకుండా ఆగిపోయి ఉన్న ‘పైసా’ ఎట్టకేలకు అడ్డంకులన్నీ అధిగమించి రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమాపై కృష్ణవంశీ, నాని ఎంతగా డిపెండ్‌ అయ్యారో కానీ కేథరీన్‌ అయితే దీనిపైనే పూర్తిగా ఆధారపడిరది. 

కృష్ణవంశీకి, నానికి వేరే సినిమాలున్నాయి కానీ కేథరీన్‌కి మాత్రం పైసాతోనే రాత మారాలి. ఈ చిత్రం హిట్‌ అయితే కేథరీన్‌కి కొత్త అవకాశాలొస్తాయి. మరి ఇంత కాలం బాక్సుల్లో మగ్గిపోయిన ఈ పైసాకి బాక్సాఫీస్‌ని శాసించే సత్తా ఉందో లేదో అనేది శుక్రవారానికి తేలిపోతుంది.