పవన్‌కళ్యాణ్‌కి హ్యాట్రిక్‌ డౌటే!

వరుసగా రెండేళ్ల పాటు బిగ్గెస్ట్‌ హిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అందించిన పవన్‌కళ్యాణ్‌ ఈ ఏడాది కూడా గబ్బర్‌సింగ్‌ 2తో పెద్ద హిట్‌ సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే గబ్బర్‌సింగ్‌ 2…

వరుసగా రెండేళ్ల పాటు బిగ్గెస్ట్‌ హిట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అందించిన పవన్‌కళ్యాణ్‌ ఈ ఏడాది కూడా గబ్బర్‌సింగ్‌ 2తో పెద్ద హిట్‌ సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే గబ్బర్‌సింగ్‌ 2 ఇంతవరకు సెట్స్‌ మీదకి వెళ్లలేదు. ఈపాటికే షూటింగ్‌ మొదలు కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్‌కి వాయిదా పడింది. 

ఏప్రిల్‌లో అయినా షూటింగ్‌ మొదలవుతుందా అనేది అనుమానంగానే ఉంది. ఈ చిత్రం కథ, కథనాలపై పవన్‌ ఇంకా వంద శాతం సంతృప్తి వ్యక్తం చేయలేదట. తనకి పూర్తిగా సంతృప్తిని ఇచ్చే వరకు కథకి మెరుగులు దిద్దమని రైటర్స్‌కి చెప్పాడట. వారు ప్రస్తుతం అదే పని మీదున్నారు. 

ఎలా చూసుకున్నా కానీ ఈ చిత్రం ఈ ఏడాదిలో పూర్తయి, విడుదల కావడం అనుమానంగానే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్‌ అయినట్టయితే త్వరగా వచ్చినట్టే అనుకోవాలి. ఆ లెక్కన పవన్‌కళ్యాణ్‌ ఈ ఏడాది కంప్లీట్‌గా మిస్‌ అవుతాడు. కొంతకాలంగా వరుసగా సినిమాలు చేస్తున్న పవన్‌కి ఇది అనుకోని అతి పెద్ద విరామం.