ఎవడుతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న శృతిహాసన్ ఈ ఏడాదిలో తన కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుందని, చాలా మంచి చిత్రాల్లో నటిస్తున్నానని ఆనందపడిపోతోంది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనకి ఈ ఇయర్ బాగా కలిసి వస్తుందని ఆమె జోస్యం చెబుతోంది.
కెరీర్‌తో సూపర్ బిజీగా ఉన్న శృతిహాసన్ ఎవరితో అయినా అఫైర్ అదీ పెట్టుకుందా? ప్రస్తుతం తనకి అంత తీరిక లేదని శృతి చెప్పింది. ఎంతటి అందగాడు, పేరున్నవాడు తనని డేట్‌కి రమ్మని పిలిచినా కానీ డైరెక్టర్స్‌ని పర్మిషన్ అడిగి వెళ్లాల్సిన పొజిషన్‌లో ఉన్నానని, ఇంతటి బిజీ షెడ్యూల్స్ మధ్య లవ్ చేసే టైమ్ లేదని చెప్పింది.
అయితే తాను వ్యక్తిగా సాధించిన దానికి, ఇండిపెండెంట్‌గా ఎదిగిన దానికి ప్రతిగా తనకి తగినవాడు తప్పక రావాలని, తనని తనకంటే ఎక్కువగా ప్రేమించేవాడు దొరికితే అంతే చాలని, అంతకుమించి కాబోయే వాడి గురించి అంచనాలు కానీ, కోరికలు కానీ ఏమీ లేవని శృతి చెప్పింది. ఆమె కోరుకుంటోన్న ఆ అద్భుతమైన ప్రేమికుడు తనకి త్వరలోనే తారసపడాలని మనమూ కోరుకుందాం.