సూపర్‌ ఎటాక్‌.. వీక్‌ పాండవులు

గత శుక్రవారం విడుదలైన రెండు చిత్రాల్లో ‘హార్ట్‌ ఎటాక్‌’ లోకల్‌గా అదరగొడుతోంది. శుక్రవారం నుంచీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’పై స్పష్టమైన ఆధిపత్యం చూపించిన ‘హార్ట్‌ ఎటాక్‌’ వీకెండ్‌ మొత్తం సూపర్‌ కలెక్షన్స్‌ రాబట్టుకుంది. వీక్‌గా…

గత శుక్రవారం విడుదలైన రెండు చిత్రాల్లో ‘హార్ట్‌ ఎటాక్‌’ లోకల్‌గా అదరగొడుతోంది. శుక్రవారం నుంచీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’పై స్పష్టమైన ఆధిపత్యం చూపించిన ‘హార్ట్‌ ఎటాక్‌’ వీకెండ్‌ మొత్తం సూపర్‌ కలెక్షన్స్‌ రాబట్టుకుంది. వీక్‌గా ఓపెన్‌ అయిన ‘పాండవులు…’ తర్వాత పుంజుకుంటుందని అనుకుంటే… ఆదివారం స్వల్పంగా కలెక్షన్స్‌లో పెరుగుదల కనిపించిందంతే. 

సోమవారం కూడా ‘హార్ట్‌ ఎటాక్‌’ కలెక్షన్స్‌ స్టడీగా ఉండడంతో ఈ చిత్రం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ముప్పయ్‌ కోట్ల పెట్టుబడి పెట్టామని చెబుతున్న ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రం మొదటి మూడు రోజుల్లో మన రాష్ట్రంలో మూడు కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టుకుంది. అదే సమయంలో హార్ట్‌ ఎటాక్‌కి ఏడు కోట్ల షేర్‌ వచ్చింది. 

యుఎస్‌లో రెండూ దాదాపు ఈక్వల్‌గానే వసూళ్లు రాబట్టుకున్నాయి. లోకల్‌గా పూర్తి ఆధిక్యత ఉన్న ‘హార్ట్‌ ఎటాక్‌’ జనవరి 31 రిలీజుల్లో విన్నర్‌గా నిలిచింది. ‘పాండవులు…’ ఇక మీదట పుంజుకోకపోతే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుంది. విశేషం ఏమిటంటే పబ్లిక్‌ టాక్‌, రివ్యూస్‌ ‘పాండవులు’కి అనుకూలంగా వచ్చాయి. కానీ పూరి జగన్నాథ్‌, నితిన్‌ల ఆకర్షణీయమైన కాంబినేషన్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తుండగా… ‘పాండవుల’కి ఆకర్షణ కొరవడింది.