కథ విషయంలో పక్కాగా ఉంటాడు మహేష్‌బాబు. అది నచ్చకే… రెండేళ్లకో సినిమా చేస్తూ అభిమానుల్ని నిరీక్షణలో పడేసేవాడు. ఇప్పుడు సీన్ మారింది. తన దగ్గరకు వచ్చిన ప్రతీ కథనీ ఒప్పుకొంటున్నాడు.
అభిమానులకు, దర్శక నిర్మాతలకూ ఇది తీపి వార్తే. కానీ డేట్లు ఎక్కడ? మహా అయితే ఏడాదికి రెండు సినిమాలు తీయగలడు అంతే. కానీ మహేష్ కోసం కథలు రాసుకొంటున్నవాళ్లు, మహేష్‌కి వినిపించి ఓకే చెప్పించుకొన్న వాళ్ల లిస్టు చూస్తే వామ్మో అనిపిస్తుంది. కొరటాల శివ, రాజ్ నిడిమోరు -కృష్ణ డికె, క్రిష్ వీళ్లంతా మహేష్‌కి కథ వినిపించారు. సుకుమార్‌తో మరో సినిమా చేస్తా అని మాటిచ్చాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో సెటిలైపోయాడు.
కొత్త కథ ఏదీ వినకుండా తాను ఒప్పుకొన్న సినిమాలు పూర్తి చేయాలంటే కనీసం మూడేళ్ల సమయం అయినా పడుతుంది. అయితే వీరిలో ముందుగా ఎవరికి ఓకే చేయాలో, ఎవరి సినిమాని ముందుగా పట్టాలెక్కించాలో తెలియక మహేష్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. మరి ఈ గందరగోళం నుంచి ఎప్పుడు బయటపడతాడో ఏంటో..?