అంజలి కథ ఇంకా కంచికి చేరలేదు. పిన్ని భారతీదేవి, దర్శకుడు కలంజియం వ్యవహారం ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కథలో కొత్త ట్విస్టు వచ్చి చేరింది. కలంజియం తనను బెదిరించాడని, తన బ్యాంకు ఖాతాలో సొమ్ము మాయం చేశాడని, ఓ సినిమాని డబ్బులు తీసుకోకుండా తన కోసం చేసిపెట్టమన్నాడని అంజలి కోర్టును ఆశ్రయించింది.
దాంతో ఈ కేసు ఇప్పుడు అంజలి పక్షాన నిలిచింది. అయితే ఈ వ్యవహారంలో తలమునకలై, అంజలి తన కెరీర్‌ని పాడుచేసుకొంటోందని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. అంజలి, పిన్నీ ఇద్దరూ కోర్టు బయటే ఈ విషయాన్ని తేల్చుకోవాలని, అయితే అంజలి మొండిపట్టుదల వల్లే ఆ అవకాశం చాలాసార్లు చేజారిపోయిందని చెబుతున్నారు.
మరోవైపు ఈ కేసు గొడవల్ల వల్ల అంజలి కెరీర్ కూడా దెబ్బతింది. వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి. ఇప్పటికైనా సీతమ్మ మొండి పట్టుదల వీడితే బెటర్… అన్నది ఆమె సన్నిహితుల సలహా.