ఇది వరకు లిప్‌లాక్ అంటే బాలీవుడ్ సినిమానే అనుకొనేవారు. ఇప్పుడు మనవాళ్లూ అందుకు తెగిస్తున్నారు. పెదవీ, పెదవీ ఎంగిలిచేసుకొని వెండి తెరను మరింత రసవత్తరం చేస్తున్నారు. తాజాగా ఆహా కల్యాణంలో కూడా ఇలాంటి ఘూటు ముద్దే ఉందట. బాలీవుడ్ చిత్రం బ్యాండ్ బాజా బారాత్‌కి ఇది అఫిషియల్ రీమేక్. బ్యాండ్ బాజాలో ఓ ఘూటు ముద్దుంది. కథకు అది కీలకం కూడా.
ఇప్పుడు అదే ముద్దును ఇక్కడ నాని – వాణీకపూర్లపై చిత్రీకరించారు. బాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రేంజులో ఈ ముద్దు సీన్ ఉందట. ముందు ఈ ముద్దు సీన్ ఉంచాలా? వద్దా? అనే విషయంపై చిత్రబృందం మధ్య పెద్ద చర్చ నడిచిందట. నాని – వాణీ ఇద్దరూ ఒప్పుకోవడంతో ఈ ముద్దుకు పచ్చజెండా పడింది.
సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పే లెవిల్లో ఈ ముద్దు సీన్ పండించాటర. సెన్సార్ వాళ్లకు ఈ ముద్దు ఎంత అవసరమో తెలియ జేయడానికి ఆహా కల్యాణం టీమ్ ముందే ప్రిపేర్ అయిపోయింది. మరి ఆ ముద్దు ఎంత ముద్దుగా తీశారో .?