ర‌జ‌నీకి కంప్లైంట్‌

80నాటి తారాతోర‌ణం అంతా చెన్నైలో క‌ల‌సి పండ‌గ చేసుకొంది. దిగ్గజ క‌థానాయ‌కులు, అలానాటి అందాల భామ‌లూ అంతా ఒక్కచోట చేరి సంద‌డి చేశారు. ఫొటోల‌కు పోజులిచ్చారు. అవి ప‌త్రిక‌ల్లోనూ పెద్ద పెద్ద సైజుల్లో ప్రింట‌య్యింది.…

80నాటి తారాతోర‌ణం అంతా చెన్నైలో క‌ల‌సి పండ‌గ చేసుకొంది. దిగ్గజ క‌థానాయ‌కులు, అలానాటి అందాల భామ‌లూ అంతా ఒక్కచోట చేరి సంద‌డి చేశారు. ఫొటోల‌కు పోజులిచ్చారు. అవి ప‌త్రిక‌ల్లోనూ పెద్ద పెద్ద సైజుల్లో ప్రింట‌య్యింది. అంతా బాగానే ఉంది. ఇప్పుడే అస‌లైన స్టార్ వార్ మొద‌లైంది. ఈ వేడుక‌కు కొంత‌మందికి ఆహ్వానాలు అంద‌లేదట‌. 

వాళ్లంతా ఏక‌మై ఈ కార్యక్రమాన్ని ద‌గ్గరుండి నిర్వహించిన సుహాసినిపై ఫైర్ అయిపోతున్నారు. జ‌య‌సుధ‌, జ‌య‌ప్రద‌లాంటి హేమాహేమీల‌కు ఆహ్వానం అంద‌లేద‌ట‌. రాజేంద్రప్రసాద్‌లాంటి న‌టుడ్ని సైతం మ‌ర్చిపోయారు. మేం 80ల నాటి క‌థానాయిక‌లం కాదా..?? అంటూ ఈ ఇద్దరు వెట‌రన్స్ అల‌క‌బూరారు. ఇంకొంత‌మంది ఏకంగా ర‌జ‌నీకాంత్‌కే కంప్లైంట్ చేశారు. ఎందుకీ వివక్షత‌?  చేస్తే అంద‌రూ క‌ల‌సి చేసుకోవాలిగానీ, ఇందులో వ‌ర్గాలేంటి??  అని నిల‌దీశారు. 

దాంతో… కార్యక్రమంలో ఆప‌శృతి దొర్లిన‌ట్టైంది. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యల‌కు పూనుకొన్నారు. త్వరలోనే మ‌ళ్లీ ఇలాంటి గెట్ టుగెద‌ర్ ఏర్పాటు చేయాల‌ని ర‌జ‌నీ సూచించార‌ట‌. అది భారీ ఎత్తున నిర్వహించాల‌ని, అప్పుడు మాత్రం ఏ ఒక్కరినీ మిస్ చేయ‌కూడ‌ద‌ని ర‌జ‌నీ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈసారైనా అంతా స‌వ్యంగా జ‌ర‌గాల‌ని ఆశిద్దాం.