అందుకే నాగ్ రాలేదు

ఆటోన‌గ‌ర్ సూర్య ఆడియో రిలీజ్ వేడుక‌కు అక్కినేని కుటుంబ స‌భ్యులు చాలామంది డుమ్మా కొట్టారు. అయితే నాగార్జున ఈ వేడుక‌కు రాక‌పోవ‌డం కాస్త సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌యుడి సినిమా పండ‌క్కి తండ్రి రాక‌పోవ‌డం ఏమిటి??…

ఆటోన‌గ‌ర్ సూర్య ఆడియో రిలీజ్ వేడుక‌కు అక్కినేని కుటుంబ స‌భ్యులు చాలామంది డుమ్మా కొట్టారు. అయితే నాగార్జున ఈ వేడుక‌కు రాక‌పోవ‌డం కాస్త సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌యుడి సినిమా పండ‌క్కి తండ్రి రాక‌పోవ‌డం ఏమిటి??  అని అంద‌రూ మాట్టాడుకొన్నారు. నాగేశ్వర‌రావు ఆరోగ్యం అంతంత మాత్రమే క‌దా, అందుకే రాలేదు అని స‌ర్దిచెప్పుకొన్నారు. అయితే అస‌లు విష‌యం అది కాదు. నాగ్ ఈ కార్యక్రమానికి రాక‌పోవ‌డానికి కార‌ణం… మ‌రొటుంది. 

అదే ఈ చిత్ర నిర్మాత‌లు. ఆర్‌.ఆర్ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అంత‌కు ముందు ఈ సంస్థ నాగ్‌తో ఢ‌మ‌రుకం సినిమా తీసింది. ఆ సినిమా విడుద‌ల జాప్యం జ‌ర‌గ‌డంతో నాగ్‌కీ, ఆ సంస్థకీ మ‌థ్య చిన్నపాటి గొడ‌వ‌లు జ‌రిగాయి. కొడుకు సినిమా ఆటోన‌గ‌ర్ సూర్య కూడా బాగా జాప్యం అయ్యింది. దాంతో నాగ్ కూడా సీరియ‌స్ అయ్యార‌ట‌. 

ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరికీ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆర్‌.ఆర్ మూవీస్‌కి నాగ్ దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. కొడుకు సినిమా అయినా స‌రే, నిర్మాత‌ల వైఖ‌రి న‌చ్చక‌పోవ‌డం వ‌ల్లే నాగ్‌, ఈ వేడుక‌కు రాలేదట‌. దానికి త‌గ్గట్టుగానే అచ్చిరెడ్డి కూడా ఆటోన‌గ‌ర్ సూర్య పాట‌ల వేడుక‌లో నాగార్జున పేరు ప్రస్తావించ‌లేదు. ఈ సినిమా హిట్టయితేగానీ నిర్మాత‌ల‌తో నాగ్ రాజీకి రాడేమో..?