నాగ్ ఎందుకు రాలేదు?

సాధార‌ణంగా అక్కినేని వార‌సుల కార్యక్రమం అంటే ఆ కుటుంబంలోని హీరోలంతా అక్కడ ప్రత్యక్ష్యమైపోతారు. నాగ‌చైత‌న్య హీరో అయ్యాక‌.. ఏ ఆడియో ఫంక్షన్‌కీ నాగార్జున డుమ్మా కొట్టలేదు. సంద‌డంతా ఆయ‌నిదే. కానీ ఆటోన‌గ‌ర్ సూర్య ఫంక్షన్‌కి…

సాధార‌ణంగా అక్కినేని వార‌సుల కార్యక్రమం అంటే ఆ కుటుంబంలోని హీరోలంతా అక్కడ ప్రత్యక్ష్యమైపోతారు. నాగ‌చైత‌న్య హీరో అయ్యాక‌.. ఏ ఆడియో ఫంక్షన్‌కీ నాగార్జున డుమ్మా కొట్టలేదు. సంద‌డంతా ఆయ‌నిదే. కానీ ఆటోన‌గ‌ర్ సూర్య ఫంక్షన్‌కి మాత్రం నాగ్ రాలేదు. 

దానికి కార‌ణం భూత‌ద్దం పెట్టుకుని మ‌రీ వెదుక్కోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అక్కినేని ఆరోగ్య ప‌రిస్థితి అంతంత‌మాత్రమే. కొన్ని రోజుల నుంచి ఆయ‌న మంచానికే ప‌రిమితమైపోయారు. ఈ ద‌శ‌లో ఆడియోలూ, వేడుక‌లూ చేసుకోవ‌డం నాగ్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ… త‌ప్పదు క‌దా? అందుకే ఈ ఫంక్షన్ ప‌చ్చ జెండా ఊపి తాను మాత్రం దూరంగా ఉన్నారు. 

సుమంత్, అఖిల్, అమ‌ల‌లు కూడా ఈ ఆడియో విడుద‌ల కార్యక్రమానికి రాలేదు. అయితే డాడీ బాగానే ఉన్నారు అని నాగ్ ఎంత చెప్పుకొన్నా… అక్కినేని ఇప్పుడు క్రిటిక‌ల్ పొజీష‌న్‌లోనే ఉన్నారు. 

క‌నీసం వేదిక‌పైనుంచి చైతూ కూడా తాత‌గారికి బాగానే ఉంది అని ఒక్క ముక్క కూడా మాట్లాడ‌లేదు. క‌నీసం తాత‌య్య పేరు కూడా ప్రస్తావించ‌లేదు. క‌నీసం తాత‌య్య ఒకే అని చైతూ ఒక్క మాట చెప్పినా, రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన అభిమానులు సంతృప్తిగా ఇళ్లకు వెళ్లేవారు.