వన్ సినిమా సెన్సారుకు సహకరించి వార్తలకెక్కిన మెగాక్యాంప్ మనిషి డైరక్టర్ మారుతి. ఇప్పుడు మళ్లీ తాజగా వార్తలకు ఎక్కాడు. తన లేటెస్ట్ సినిమా 'లవ్యూ బంగారమ్'ను ఈ నెల 24నవిడుదల చేయాలని డిసైడ్ చేసాడు.
మారుతి సినిమాలంటే యూత్ ఫుల్ గా వుంటాయి. దాని కలెక్షన్లు దానికి వుంటాయి. మరి అలాంటది ఎవడు విడుదలై పది రోజులు కాకుండానే, ఆ సినిమాను వదలడం అంటే, ఈ సినిమా కలెక్షన్లు డైవర్ట్ కావడమే.
మరి మారుతి అలా ఎందుకు చేస్తున్నాడని మెగాభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. అంటే ఎవడు కలెక్షన్లు అప్పటికి రావాల్సినంతా వచ్చేస్తాయి, ఇంక వేరే సినిమాల కోసం జనాలు చూస్తుంటారనా? లేక దేని ప్రేక్షకులు దానికి వుంటారనా? మారుతినే చెప్పాలి.