టెన్నెస్సీలో TAS సంక్రాంతి సంబరాలు

అమెరికాలోనే టెన్నెస్సీ ఆంధ్ర సమితి ఆధ్వర్యంలో జనవరి 11న ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న ఈ వేడుకలలో…

అమెరికాలోనే టెన్నెస్సీ ఆంధ్ర సమితి ఆధ్వర్యంలో జనవరి 11న ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న ఈ వేడుకలలో కిడ్స్ ఫాషన్ షో, నృత్య ప్రదర్సనలు, స్త్రీల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు, సంప్రదాయ దుస్తులతో కూడిన ఫాషన్ షో, ఆదర్సనీయమైన దంపతులకు, కొత్త అల్లుళ్ళకు అతిధి మర్యాదలతో కూడిన బహుమతులు అందజేయడంవంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు TAS వేదికయ్యింది. TAS సభ్యురాలు శ్రీమతి ప్రతిమ అతిథులందరిని మంచి విందు భోజనాలతో ఆనందింపజేశారు.

 తానా మాజీ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ ప్రసాద్ తోటకూరను ప్రత్యేక ఆహ్వానితులుగా,ఆహ్వానించి TAS కమిటీ కోశాధికారి రమేష్ అరమాన్లగారు, మధు పరుచూరిగార్ల చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. అనంతరం  ప్రముఖ NRI గాయని శ్రీమతి మణి శాస్త్రిగారికి ప్రసాద్ తోటకూరగారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. శ్రీ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ TAS చేస్తున్న సేవాకార్యక్రమాలుగాని, తెలుగు పండుగలకు, ఆచారాలకు ప్రాముఖ్యతను ఇస్తూ చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలుగాని చాలా అద్భుతంగా, ఆదర్శనీయంగా వున్నాయని చెపుతూ  ఇంత చక్కగా TAS సంస్థను విజయ పథంలో నడిపిస్తున్న ప్రెసిడెంట్ శ్రీమతి రేవతి మెట్టుకూరును, కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. 

అనంతరం TAS అధ్యక్షురాలు శ్రీమతి రేవతి మెట్టుకూరు మాట్లాడుతూ TAS సంస్థ తెలుగు ప్రజలకోసం, తెలుగు సంప్రదాయాల మనుగడ కోసం సేవా భావంతో ముందుకెళ్ళుతోందని, ఇందులో తెలుగువాళ్ళందరు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడమే TAS విజయానికి ముఖ్యకారణమని తెలియజేసారు. తెలుగు గడ్డకు సంబంధించిన ప్రతి పండుగను ఎంతో ఘనంగా అందరికి దగ్గర చేస్తూ వేడుకలు నిర్వహించడం TAS ప్రత్యేకతని, బతుకమ్మ, సంక్రాంతి, దీపావళి, హోలీ వంటి అన్ని సంప్రదాయపు పండుగలకు TAS వేదికవ్వడం సంతోషంగా వుందని తెలియజేసారు. 

కార్యక్రమం విజయవంతమవ్వడంలో ముఖ్య పాత్ర పోషించిన కమిటీ సభ్యులు రమేష్ అరమాండ్ల, రంగానాయికి ముడుంబి, లతా శశి, కిరణ్ కమతం, సౌమ్య దంత్యాల, హారిక కనగాల, రాజేష్ తాతినేని, పవన్ గంత్యాల, ఉమా సప్పిడి, శ్రీధర్ కర్ర, కేశవ్ మూర్తి, శేష అపర్నాథ్, సందీప్ గొండేల, రాజ వేమూరి, సుష్మ పెద్దిరెడ్డి, మోనికా అరమాండ్ల, సప్న సురేష్, అన్విత మట్ట, తేజస్ సుంకి మరియు  రోహంత్ తుమ్మలకు ప్రత్యేక అభినందనలను అందించారు.  చక్కటి సౌండ్ సిస్టంను అందించిన శ్రీనివాస్ దుర్గంగారికి, కార్యక్రమ నిర్వాహణలో అండగా నిలిచిన నాగరాజన్ గారికి  TAS అధ్యక్షురాలు రేవతి మెట్టుకూరుగారు ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేసారు.