‘ఎవడు’పై కేసు నమోదు

ఈ మధ్యకాలంలో సినిమాలు – వివాదాలతో సావాసం చేస్తున్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి, సినిమాల్లో పాత్రధారుల విషయంలోనూ, వారి పేర్ల విషయంలో, కథ విషయంలో.. ఇలా ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. వివాదాల్లేకుండా సినిమా…

ఈ మధ్యకాలంలో సినిమాలు – వివాదాలతో సావాసం చేస్తున్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి, సినిమాల్లో పాత్రధారుల విషయంలోనూ, వారి పేర్ల విషయంలో, కథ విషయంలో.. ఇలా ఒకటేమిటి అన్ని విషయాల్లోనూ వివాదాలు తలెత్తుతున్నాయి. వివాదాల్లేకుండా సినిమా విడుదలవడమే కష్టంగా మారింది. విడుదలయ్యాక వివాదాలూ సినిమాని కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంటే మరికొన్నిసార్లు, ఆయా సినిమాలకు వివాదాలు పబ్లిసిటీ పరంగా కలిసొస్తున్నాయి.

ఇక, తాజాగా ‘ఎవడు’ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. కారణం సినిమాలో అశ్లీల దృశ్యాలు వున్నాయనే ఆరోపణలు రావడమే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. సినిమా పోస్టర్లు అశ్లీలంగా వున్నాయనీ, సినిమాలోనూ అశ్లీలత వుందనీ నాగేంద్రపసాద్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

ఆ మధ్య సినిమాల్లో మామూలు గ్లామర్‌ని కూడా అసభ్యంగా భావిస్తూ, సెన్సార్‌ బోర్డ్‌ తన కత్తెరకు పదును చెప్పింది. ‘ఎవడు’ సినిమా విషయంలో ఏం జరిగిందోగానీ, హీరోయిన్‌ అమీజాక్సన్‌ బికినీని తలపించే డ్రస్సుల్లో కన్పించినా సెన్సార్‌ లైట్‌ తీసుకుంది. అఫ్‌కోర్స్‌ ఇలాంటివి చాలానే చాలా సినిమాల్లో సెన్సార్‌ లేకుండా బయటపడ్డ సన్నివేశాలన్నాయనుకోండి.. అది వేరే విషయం.

మొత్తమ్మీద ‘ఎవడు’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న దరిమిలా, ఈ వివాదం సినిమాకి అదనపు ఆకర్షణగా మారే అవకాశం వుంది. కేసులంటారా.. ఇలాంటివి ఎన్ని నిలబడ్డాయి.? అనుకోవాల్సిందంతే.