రామ్ చరణ్ ఇప్పటికే పలు సూపర్‌హిట్ సినిమాలు అందించి స్టార్‌గా తన సత్తా ఏమిటనేది చూపించాడు. మగధీర తర్వాత ‘ఆరెంజ్’ మినహా చరణ్ నటించిన ఏ సినిమా కూడా విడుదలకి ముందు అంచనాలు రేకెత్తించలేదు. ‘రచ్చ’ రిలీజ్ కాకముందు, రిలీజ్ రోజు మార్నింగ్ షో తర్వాత కూడా సినీ విమర్శకులు దానిని కొట్టి పారేసారు. కానీ నలభై అయిదు కోట్ల షేర్‌తో చరణ్ తన మాస్ ఫాలోయింగ్ ఏమిటో చూపించాడు.
గత ఏడాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ‘నాయక్’ రిలీజ్ అవుతుంటే దాని ధాటికి ఇది తట్టుకోలేదని అన్నారు. కానీ ఆ చిత్రానికి ధీటుగా ‘నాయక్’ ఆడింది. చరణ్ బలమేంటో మరోసారి చూపించింది. ఈసారి కూడా ‘1 నేనొక్కడినే’తో ‘ఎవడు’ రిలీజ్ అవుతోందంటే… ఇంత స్టేల్ అయిపోయిన సినిమా నిలబడ్డం కష్టమన్నారు.
కానీ ఇప్పుడు ఎవడు బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. తొలి రెండు రోజుల్లోనే కేవలం మన రాష్ట్రంలోనే దాదాపు పదమూడు కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం భోగి రోజు మ్యాట్నీ నుంచి అదరగొడుతోంది. ముఖ్యంగా సీడెడ్, ఆంధ్రలో ఈ చిత్రం ధాటికి వేరే ఏ సినిమా నిలబడలేకపోతోంది. చరణ్‌ని ఎన్నిసార్లు ఇంటర్నెట్ క్రిటిక్స్ తక్కువ చేసినా కానీ అతి కీలకమైన మాస్ ఫాలోయింగ్‌లో అతనికి తిరుగులేదు. మినిమమ్ గ్యారెంటీ సినిమా చేస్తే దాని రేంజ్‌ని అమాంతం పెంచగల ఫాన్ బేస్ చరణ్ సొంతం.