పవన్‌కళ్యాణ్ ‘రేయ్’ ఆడియో రిలీజ్‌కి వస్తున్నాడు. పవన్ ఈమధ్య మూడో పెళ్లితో వార్తల్లో నిలిచిన తర్వాత ఎటెండ్ అవుతున్న సినిమా ఈవెంట్ ఇదే. అత్తారింటికి దారేది సక్సెస్ మీట్‌లో పవన్ ప్రసంగం ఇప్పటికీ ఫాన్స్ చెవుల్లో రింగుమంటూనే ఉంది. ఆ తర్వాత మళ్లీ సినిమా వేడుకలో పవన్ పాల్గొనబోతోంది ఇప్పుడే.
పవన్‌కళ్యాణ్ తన సినిమాలకి కాకుండా వేరే చిత్రాల వేడుకలకి చాలా తక్కువగా వస్తుంటాడు. అతను ఆడియో రిలీజ్ చేసిన సినిమాల్లో ఇష్క్, నాయక్, జులాయి మంచి హిట్ అయ్యాయి. దాంతో పవన్ హ్యాండ్ చాలా మంచిదని, అతను వస్తే సినిమాకి కలిసొస్తుందని సెంటిమెంట్ అయింది.
రేయ్ చిత్రానికి పవన్‌కళ్యాణ్ కర్త, కర్మ అని వైవిఎస్ చౌదరి చెబుతున్నాడు. పవన్ వల్లే ఈ చిత్రం సాధ్యమైందని అంటున్నాడు. మరి ఈ చిత్రానికి పవన్ ఏ విధమైన సహకారం అందించాడో తెలీదు కానీ ఈ చిత్రంతో పరిచయం అవుతున్న అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాత్రం తన మేనమామ చేయి తనకి కలిసొచ్చి భారీ విజయం ఖాయమనే ధీమాలో ఉన్నాడు.