సమంతతో రిపీట్‌

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సమంత చేసిన క్యారెక్టర్‌ సినిమాలో ఎక్కువ సేపు కనిపించకపోయినా కానీ ఉన్నంతలో ఆమె కామెడీ టైమింగ్‌ బాగా ఆకట్టుకుంది. ‘స్వామీ నదికి పోలేదా..’, ‘చెరిపెయ్‌నా మమ్మీ’లాంటి డైలాగ్స్‌ని ఆమె అద్భుతంగా…

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సమంత చేసిన క్యారెక్టర్‌ సినిమాలో ఎక్కువ సేపు కనిపించకపోయినా కానీ ఉన్నంతలో ఆమె కామెడీ టైమింగ్‌ బాగా ఆకట్టుకుంది. ‘స్వామీ నదికి పోలేదా..’, ‘చెరిపెయ్‌నా మమ్మీ’లాంటి డైలాగ్స్‌ని ఆమె అద్భుతంగా పండించింది. త్రివిక్రమ్‌ సినిమాల్లో ఆ టైమింగ్‌ అందుకున్న తొలి హీరోయిన్‌ సమంతేనేమో. 

అందుకే తన తదుపరి చిత్రంలో కూడా సమంతని రిపీట్‌ చేయడానికి త్రివిక్రమ్‌ డిసైడ్‌ అయ్యాడు. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్న చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుంది. అల్లు అర్జున్‌తో ఆమెకి ఇదే తొలి చిత్రం అవుతుంది. దీంతో మెగా హీరోల్లో చరణ్‌ మినహా మిగతా ఇద్దరితోను నటించినట్టవుతుంది. 

సమంత ప్రస్తుతం తెలుగులో రభస కాకుండా వినాయక్‌ సినిమా మాత్రమే చేస్తోంది. తమిళంలో ఆమెకి రెండు సినిమాలున్నాయి. త్వరలోనే ఆటోనగర్‌ సూర్య రిలీజ్‌ కానుంది. గత మూడేళ్లుగా తీరిక లేకుండా నటిస్తున్న సమంత ఈ ఏడాది కూడా బిజీ బిజీగా ఉండనుంది.