అధికారికంగా కాస్ట్‌లీయస్ట్ తెలుగు ఫిలిం అని, అనధికారికంగా 70 కోట్ల వరకు బడ్జెట్ అయిందని ‘1 నేనొక్కడినే’ గురించి చాలా విన్నాం. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటేనే యాభై అయిదు కోట్లకి పైగా షేర్ థియేటర్స్ నుంచే రావాలని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ చిత్రం మొదటి వారం వసూళ్లని బట్టి భారీ నష్టం తప్పదని తేలిపోయింది.
మొదటి రోజే తిరస్కారానికి గురైన ఈ చిత్రాన్ని ఒక వర్గం ప్రేక్షకులు మోసే ప్రయత్నం చేసారు. ఓవర్సీస్‌లో మహేష్ క్రేజ్ కారణంగా వన్ మిలియన్ డాలర్లు వస్తే సినిమా టాక్ బెటర్ అవుతుందని, ఆదరణ పెరుగుతుందని చిత్ర బృందం ప్రచారం చేసింది. కానీ హైదరాబాద్‌తో సహా ఈ చిత్రం అన్ని చోట్లా తిరస్కరణకి గురైంది. సంక్రాంతికి కూడా చెప్పుకోతగ్గ వసూళ్లు సాధించలేకపోయింది.
మొదటి వారంలో వరల్డ్ వైడ్‌గా పాతిక కోట్ల షేర్ రాబట్టుకున్న ఈ చిత్రం ఇక పెద్దగా రాబట్టుకునేదేమీ లేదు. బి, సిల్లో పరిస్థితి దారుణంగా ఉంది కనుక వచ్చేదేమైనా ఉంటే ఏ సెంటర్స్ నుంచే రావాలి. ఎలా చూసినా కానీ ఈ చిత్రం పాతిక కోట్ల పైగానే నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లు వచ్చినా కానీ అమ్మిన రేట్ల ప్రకారం బ్రేక్ ఈవెన్ కావడం అక్కడైనా అసాధ్యమే అనిపిస్తోంది.