ఆగడు కోసం వీరా?

ఆగడులో రాజేంద్రప్రసాద్?క్యరెక్టర్ నటుడిగా తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక, తొంబై తొమ్మిది శాతం ఫ్లాపులు తప్ప హిట్ తెలియని నటుడు రాజేంద్రప్రసాద్. ఒక్క జులాయి ఒక్కటే చావు తప్పి కన్ను లొట్టపోయింది.  Advertisement మొగుడు,…

ఆగడులో రాజేంద్రప్రసాద్?క్యరెక్టర్ నటుడిగా తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక, తొంబై తొమ్మిది శాతం ఫ్లాపులు తప్ప హిట్ తెలియని నటుడు రాజేంద్రప్రసాద్. ఒక్క జులాయి ఒక్కటే చావు తప్పి కన్ను లొట్టపోయింది. 

మొగుడు, బావ లాంటి సినిమాలైతే భారీ ఫ్లాపులే. ఇప్పుడు తాజాగా మహేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లోని ఆగడు లో కూడా ఓ కీలకమైన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ ఎంపికైనట్లు తెలిసింది. ఈ నెల 18నుంచి ప్రారంభమవుతున్న కీలక షెడ్యూలులో ఆయనపై కొన్ని సన్నివేశాలుంటాయి. 

చిత్రమేమిటంటే, రాజేంద్ర ప్రసాద్ మాదిరిగానే మెయిన్ విలన్ గా పెద్దగా లక్ లేని సాయికుమార్ కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించడం. వీళ్ల అదృష్టాన్ని ఆగడు మారుస్తుందేమో చూడాలి.