మారుతీ..యూ..టూ

దర్శకుడు మారుతి మరో స్టెప్ ముందుకేసాడు. అల్లువారి సినిమా కొత్త జంట కోసం తయారు చేసిన మేకింగ్ విడియోలో మైకందుకుని సింగేసినట్లు చిన్న లుక్ ఇచ్చాడు. కొత్తజంటలో పాతపాట ‘అటు అమలాపురం’ ను రీమిక్స్…

దర్శకుడు మారుతి మరో స్టెప్ ముందుకేసాడు. అల్లువారి సినిమా కొత్త జంట కోసం తయారు చేసిన మేకింగ్ విడియోలో మైకందుకుని సింగేసినట్లు చిన్న లుక్ ఇచ్చాడు. కొత్తజంటలో పాతపాట ‘అటు అమలాపురం’ ను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని మేకింగ్ విడియో నెట్ లోకి వచ్చింది. 

ఇందులో ఇటు మారుతి గొంతు కలిపినట్లు పిక్చరైజ్ చేయడం ఒక విశేషమైతే, తలపై హుడ్, నోటికి కవర్ తో కొత్తలుక్ లో కనిపించి, మరోపక్క శిరీష్ కు నృత్యభంగిమలు కూడా సూచించేసాడు. ఇలా అన్నింటా తానై నిలిచిన ఈ విడియోలో అల్లు అర్జున్ స్పెషల్ అప్పీరియన్స్. 

అంతా బాగానే వుంది. కానీ అల్లు శిరీష్ లుక్, మిగిలిన వ్యవహారాలు ఏమంత మారినట్లు కనిపించలేదు.. సినిమాకు ఈ విడియోలు, ఇతరత్రా వ్యవహారాలు కాదు కీలకం..శిరీషే కీలకం. అతగాడి మేకింగ్ ముఖ్యం.