‘1 నేనొక్కడినే’ చిత్రానికి పర్సనల్‌గా ఓటేసిన రాజమౌళి ఈ చిత్రంలో ఫ్లాస్ కూడా ఉన్నాయని ఎత్తి చూపించాడు. అలాగే ఈ రెండు సినిమాల్లో ‘ఎవడు’ విన్నర్ అని కూడా రాజమౌళి ఒప్పుకున్నాడు. సినిమా ఎంత కొత్తగా తీసినా కానీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయాలని రాజమౌళి ఓ అభిమానికి చెప్పాడు.
కొత్తగా ఉందా, రొటీన్‌గా ఉందా అనేది ఎక్కువ మందికి అవసరం లేదని, థియేటర్‌కి ఎంటర్‌టైన్ అవడానికే ప్రేక్షకులు వస్తారని, అది ఎవడు ప్రొవైడ్ చేసిందని రాజమౌళి అన్నాడు. అలాగే హరీష్ శంకర్ కూడా రెండు విభిన్న చిత్రాలు తీయడానికి ప్రయత్నించిన దర్శకులని కంగ్రాచ్యులేట్ చేసాడు.
వంశీ పైడిపల్లి ప్రేక్షకులకి ‘ఈజీ’గా అర్థమయ్యే దారిని ఎంచుకున్నాడని ‘ఎవడు’ విజయానికి కారణం చెప్పాడు. మొత్తానికి ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని కాంప్లెక్స్‌గా తయారు చేసిన సుకుమార్ మరోసారి సామాన్య ప్రేక్షకులకి అర్థమయ్యేలా సింపుల్‌గా సినిమాలు తీయలేనని చాటుకున్నాడు. తన తదుపరి చిత్రంలో అయినా సుకుమార్ మరీ టూమచ్ ఇంటెల్లిజెన్స్ ప్రదర్శించకపోతే అతనికే మంచిదంటున్నారు విమర్శకులు.