తనికెళ్ల భరణి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తారని భావిస్తున్న భక్త కన్నప్ప జీవిత గాథ జూన్ నుంచి సెట్ పైకి వెళుతుందని తెలుస్తోంది. బాపు-రమణ-కృష్ణంరాజు కాంబినేషన్ లో భక్త కన్నప్ప ఒకసారి ఎవర్ గ్రీన్ హిట్ గా వచ్చేసింది. పైగా ఇందులో వేటూరి కిరాతార్జునీయం నభూతో న భవిష్యతి అన్నట్లు నిలిచిపోయింది.
Advertisement
సహజంగా పరమ శివ భక్తుడైన తనికెళ్ల భరణి మళ్లీ తనదైన శైలిలో దీనిని తీయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునీల్ ను కథానాయకుడిగా ఎన్నుకొన్నారని , తొలుత భక్త కన్నప్ప అని పేరు పెడతారని భావించినా, చివరకు కన్నప్ప అని మార్చారని తెలుస్తోంది.