ప్రఖ్యాత చిత్రకారులు – చలనచిత్ర దర్శకులు బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ అందించబోతున్నది గల్ఫ్ ఆంధ్ర తెలుగు ఫోరం. గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసరి త్రిమూర్తులు కార్యక్రమ విశేషాలు తెలిపారు.
గత పదేళ్లుగా గల్ఫ్ లోని తెలుగు వారికోసం నాచోరే రంభ,స్టార్ క్రికెట్,కెవ్వు కేక,దిల్సే దుబాయ్ వంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం తో గల్ఫ్ తెలుగు సాంస్కృతిక చరిత్రలో మొట్టమొదటిసారిగా సినీ సంగీత రంగానికి అత్యంత ప్రతిస్టాత్మకంగా అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు.
దుబాయ్ లోని ప్రఖ్యాత జబీల్ పార్క్ లో జనవరి 31 సాయంత్రం జరగబోయే గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ – గామ అవార్డ్స్ పేరిట 2013 వ సంవత్సరంలో విడుదలై విజయవంతమైన చిత్రాల సంగీత దర్శకులకి ,గీతరచయితలకి, గాయకులకి ,అవార్డులు అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా టాలివుడ్ గాయకుల చే మ్యూజికల్ ప్రోగ్రాం,టాలివుడ్ హీరోయిన్ల స్పెషల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లు, జబర్దస్త్ కామెడీ ..లతో పాటు మరెన్నో సర్ప్రైజ్ లు అందించబోతున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో www.gulfandhraevents.com సైట్ ద్వారా ..తమకు నచ్చిన పాటలు,గాయకులను వోటింగ్ ద్వారా ఎన్నుకోవచ్చని, టికెట్ మరియు ఇతర వివరాలన్ని సైట్ లో అందుబాటులో ఉన్నాయని వెబ్ సైట్ రూపకర్త – ఇండియా సమన్వయకర్త మిమిక్రీ ఫణి మాధవ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు,డైలాగ్ కింగ్ సాయి కుమార్, బోయపాటి శీను, నరేష్, ఆమని,మ్యూజిక్ డైరెక్టర్లు దేవి శ్రీ ప్రసాద్, చక్రి,ఆర్ పీ పట్నాయక్,ఎం ఎం శ్రీలేఖ, కుంచె రఘు, గాయకులు మనో,కారుణ్య,సునీత,కల్పన,సుమంగళి,రచయితలు సుద్దాల అశోక్ తేజ,అనంత్ శ్రీరాం ,మంచు మనోజ్, రోజా,గజల్ శ్రీనివాస్ , చార్మి,కామ్న జెత్మలాని,పూనం బాజ్వా వంటి టాలివుడ్ కు చెందిన ప్రముఖ నటులు,దర్శకులు,సంగీత దర్శకులు,గీతరచయితలు,గాయకులు,ఇతర కళాకారులెందరో విచ్చేస్తున్నారని స్టార్ కమెడియన్ అలీ, మహిళలు మెచ్చిన యాంకర్ సుమ యాంకర్లు గా అద్భుతమైన కార్యక్రమం గల్ఫ్ తెలుగు వారికోసం రూపొందిస్తున్నమని, కేసరి త్రిమూర్తులు తెలిపారు.