ఎవడు 50 క్రాస్ చేస్తుందా?

ఎవడు హిట్ అన్నది డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక విషయం అల్లా ఒకటే. అది 50 ప్లస్ క్లబ్ లో చేరుతుందా అన్నది.. తొలి రోజు కలెక్షన్లు తొమ్మిది కోట్ల వరకు వచ్చాయన్నది దిల్…

ఎవడు హిట్ అన్నది డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక విషయం అల్లా ఒకటే. అది 50 ప్లస్ క్లబ్ లో చేరుతుందా అన్నది.. తొలి రోజు కలెక్షన్లు తొమ్మిది కోట్ల వరకు వచ్చాయన్నది దిల్ రాజు మాట. సోమవారం నుంచి గురువారం దాకా సహజంగానే పండుగ కలెక్షన్లు వుంటాయి. అంటే అప్పటికే ముఫై దాటేసే అవకాశం వుంది. 

కోస్తా ఆంధ్రలో పండుగ సీజన్ దాదాపు పది రోజుల దాకా వుంటుంది. పైగా 31 దాకా పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు. ఇవన్నీ ఎవడుకు కలిసి వచ్చే అంశాలే. అందువల్ల 50 కోట్ల వసూళ్లు రాబట్టేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా  వేస్తున్నాయి.  

31 న వచ్చిన సినిమాల ఫలితాన్ని బట్టి ఆపైన ఏ మేరకు అన్నది ఆధారపడి వుంటుంది.