నడ్డి విరిచిన ధరాభారలనీ
నయవంచకులు చేసిన హృదయ గాయాలనీ
కలవర పెడుతున్న కష్ట సుఖాలనీ
ప్రాంతీయ పోరాటాలనీ కులాల కోలాటాలనీ
మతాల మారణాయుధాలనీ పాలిత పీడిత వైషమ్యాలనీ
భోగీ మంటలో భస్మం చెసెయ్యు
తాడిత పీడిత జనుల సంక్రాంతి కోసం
నీ హృదయ క్రాంతిని వెదజల్లి
పోట్ల గిత్తల పరుగుల వెంట
కోడి పందాల జూదం కంట పడకుండా
మమతానురాగాల ముంగిట
ముగ్గులు వేసి మకర సంక్రాంతికి మెరుగులు దిద్దు
నీ జీవితమే కావాలి సుఖ సంగమాల హద్దు
Advertisement
గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు
మీగడ త్రినాధ రావు