వెటకారం కాదు మమకారమే

అల్లు శిరీష్ తో దర్శకుడు మారుతి తీస్తున్న సినిమా కొత్తజంట. ఈ సినిమాలో పవన్ పై సెటైర్ సాంగ్ వుందని వార్తలు గుప్పుమన్నాయి. అంతే మారుతిపై పవన్ అభిమానుల ఫోన్ల దాడీ భగ్గుమంది. అయితే…

అల్లు శిరీష్ తో దర్శకుడు మారుతి తీస్తున్న సినిమా కొత్తజంట. ఈ సినిమాలో పవన్ పై సెటైర్ సాంగ్ వుందని వార్తలు గుప్పుమన్నాయి. అంతే మారుతిపై పవన్ అభిమానుల ఫోన్ల దాడీ భగ్గుమంది. అయితే ఇదెలా పుట్టిందో తనకు తెలియదని, అటు అమలాపురం అన్న పాటలో పవన్ సినిమా పోస్టర్లు మాత్రం వుంటాయని మారుతి బదులు చెప్పుకోవాల్సి వస్తోంది. 

పవన్ పై తనకు విపరీతమైన గౌరవమని, తానెందుకు సెటైర్లు, వెటకారం చేస్తానని సముదాయిస్తున్నాడు. అత్తారింటికిదారేది లో గ్యాంగ్ తో ఫైటింగ్ సీన్ ఒకటి మాత్రం సప్తగిరితో వుందని అది కూడా వెటకారం కాదని, పవన్ ఇమేజ్ గుర్తుచేసేదే అని అంటున్నారు మారుతి.