మీ ప్రచారానికి నా సినిమా ఎందుకు?

ఇటీవల సినిమాలలో, టీవీల్లో పొగతాగే, లేదా మద్యం తాగే సన్నివేశాలు రాగానే అవి ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన తెరమీద కనబడుతూ వుంటుంది. ప్రభుత్వం విధించిన నియమం అది. ''నేను యీ నియమాన్ని ఖాతరు…

ఇటీవల సినిమాలలో, టీవీల్లో పొగతాగే, లేదా మద్యం తాగే సన్నివేశాలు రాగానే అవి ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన తెరమీద కనబడుతూ వుంటుంది. ప్రభుత్వం విధించిన నియమం అది. ''నేను యీ నియమాన్ని ఖాతరు చేయను'' అంటున్నాడు హిందీ సినిమా దర్శకుడు అనురాగ్‌ కాశ్యప్‌. విడుదలకు సిద్ధంగా వున్న తన ''అగ్లీ'' అనే సినిమాలో అలాటి వేమీ పెట్టనని చెప్తున్నాడు. '' ఆ సినిమాలో కథ ఏమిటంటే పట్టపగలు ఒక పిల్లవాడు కిడ్నాప్‌ అవుతాడు. పరిశోధన ప్రారంభమవుతుంది. రోజురోజుకి దానిలో అనేక మలుపులు బయటపడతాయి. సమాజంలో అనేకవర్గాల వికృతరూపాన్ని బయటపెడుతూ కథ సాగుతుంది. అలాటి సస్పెన్సు సినిమాలో పట్టున్న దృశ్యం నడుస్తూండగా మధ్యలో యిలాటి ఆరోగ్య సందేశాలు తెరమీద కనబడితే  ప్రేక్షకుడు కథలో లీనం కాలేడని అతని వాదన. 

''నేను సినిమా తీసేది వినోదానికి. ఇలాటి సందేశాలు యివ్వడానికి కాదు. అయినా అనారోగ్యకరమైన వస్తువులైన సిగరెట్టు, మద్యం అమ్మకాలపై పన్నులు వేసి ఆదాయం గడిస్తున్న ప్రభుత్వం యిలాటి ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టాలి. నేను సినిమా తీస్తే దానిలో సందేశం పెట్టాలని పట్టుబట్టడం, పెట్టకపోతే చట్టవ్యతిరేకం అనడం అన్యాయం.'' అని వాదిస్తున్నాడు అనురాగ్‌. నిజమే కదూ! ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వాటి అమ్మకాలు ఆపేయించాలి. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]