అతనిపై ఆర్జీవీ బ్రహ్మాస్త్రం

రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్ని అతని అభిమానులు కూడా అసహ్యించుకునేలా తీస్తున్నాడీ మధ్య. గతంలో వర్మ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్‌ అయినా కానీ టెక్నికల్‌గా సుపీరియర్‌గా ఉండి, అభిమానులు మా దర్శకుడి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా…

రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్ని అతని అభిమానులు కూడా అసహ్యించుకునేలా తీస్తున్నాడీ మధ్య. గతంలో వర్మ సినిమాలు కమర్షియల్‌గా ఫెయిల్‌ అయినా కానీ టెక్నికల్‌గా సుపీరియర్‌గా ఉండి, అభిమానులు మా దర్శకుడి సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఉండేవి. ఇప్పుడు వర్మ ఆలోచనలతో పాటు సినిమాలు కూడా చాలా చీప్‌గా ఉంటున్నాయి. 

ఏదో గాల్లో ఒక చిన్న ఐడియా తడితే దానిపై బేసిక్‌ వర్క్‌ చేయకుండా సినిమా తీసేయడం, అదేమో చివరకు తల, తోక లేకుండా తయారు కావడం పరిపాటి అయిపోతోంది. రీసెంట్‌గా వచ్చిన ‘సత్య 2’తో వర్మ తన ఖాతాలో మరో చెత్త చిత్రాన్ని జమ చేసుకున్నాడు. ఇంతకాలం హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య చక్కర్లు కొట్టిన వర్మ త్వరలో పూర్తిస్థాయి తెలుగు సినిమా తీయబోతున్నాడు. 

మంచు విష్ణు హీరోగా వర్మ తదుపరి చిత్రం ఉంటుంది. దీంట్లో రెజీనా కథనాయికగా నటించే అవకాశముంది. వర్మ ప్రతిష్టకి సవాల్‌లాంటి ఈ చిత్రాన్ని ఆయన ఎంతటి సవాల్‌గా స్వీకరిస్తారో, ఎలాంటి బదులిస్తారో తెలీదు కానీ ఈమధ్య వర్మ ధాటికి ప్రతి హీరో డీలా పడిపోయాడు. మంచు విష్ణు ఫ్యూచర్‌ ఎలాగుంటుందనేది చూడాలిక.