అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందనే సంగతి తెలిసిందే. దీని తర్వాత బన్నీ నటించే చిత్రం కూడా ఖరారైపోయింది. గోపీచంద్ మలినేని చెప్పిన కథ అల్లు అర్జున్‌కి, అల్లు అరవింద్‌కి బాగా నచ్చిందని, సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘బలుపు’తో సూపర్‌హిట్ కొట్టిన గోపీచంద్ అప్పట్నుంచీ అల్లు అర్జున్‌కి నచ్చే కథ కోసం కసరత్తు చేస్తూనే ఉన్నాడు.
తను ఎలాంటి కథ కావాలని కోరుకుంటున్నాడనేది గోపీచంద్ మలినేనికి అల్లు అర్జున్ కొన్ని హింట్స్ ఇచ్చాడట. దాని ప్రకారం అల్లు అర్జున్ కోసం ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ని గోపీచంద్ రెడీ చేసుకున్నాడు. కథ పక్కాగా సిద్ధమయ్యాక ఒకేసారి అర్జున్, అరవింద్‌కి గోపీచంద్ నెరేషన్ ఇవ్వగా, చాలా బాగుందని ఇద్దరూ ప్రశంసించారట. చిన్న మార్పులు కూడా సూచించకుండా తప్పకుండా చేద్దామన్నారట.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తాడు. మార్చి, ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళుతుంది. త్రివిక్రమ్ చిత్రం పూర్తయ్యే దశకి చేరుకుంటూ ఉండగా అల్లు అర్జున్ దీనిని స్టార్ట్ చేస్తాడు. అతని రేసు గుర్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. వరుసగా అందరూ పేరున్న దర్శకులతో చేస్తూ రాబోయే ఏడాది బన్నీ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు.