బండ్ల గణేష్‌ తగ్గలేదు…

అనూహ్యంగా నిర్మాణ రంగంలోకి వచ్చి, స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయిన ఒకప్పటి సాదా సీదా కమెడియన్‌ బండ్ల గణేష్‌, సూపర్‌ కాంబినేషన్స్‌ సెట్‌ చేయడంలో దిట్ట.. అన్పించుకున్నాడు. భారీ బడ్జెట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు…

అనూహ్యంగా నిర్మాణ రంగంలోకి వచ్చి, స్టార్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయిన ఒకప్పటి సాదా సీదా కమెడియన్‌ బండ్ల గణేష్‌, సూపర్‌ కాంబినేషన్స్‌ సెట్‌ చేయడంలో దిట్ట.. అన్పించుకున్నాడు. భారీ బడ్జెట్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు బండ్ల గణేష్‌. ‘బాద్‌షా’ కొట్టిన దెబ్బకి, ‘ఇద్దరమ్మాయిలతో’ ఇచ్చిన షాక్‌కి విలవిల్లాడిన బండ్ల గణేష్‌ మళ్ళీ కుదురుకున్నాడు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాడు బండ్ల గణేష్‌. దీని తర్వాత మహేష్‌ ` త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాకి బండ్ల గణేష్‌ ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ కాంబినేషన్‌ దాదాపు ఓకే అయిపోయిందనే తెలుస్తోంది.

అంటే, బండ్ల గణేష్‌ వరుస ఫ్లాపులతో డీలా పడలేదనీ.. భారీ కాంబినేషన్స్‌ సెట్‌ చేయడానికి టైమ్‌ తీసుకున్నాడనీ అర్థమవుతోంది. త్వరలోనే బండ్ల గణేష్‌.. తాను చేయబోతోన్న సినిమాలకు సంబంధించిన వివరాల్ని భారీ హంగామాతో బయటపెట్టనున్నాడట.